Share News

నీటి వృథాపై రూ.5 వేల జరిమానా.. జీడబ్ల్యూఎంసీ కీలక నిర్ణయం

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:19 PM

ఎల్‌నినో నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నీటి వృథాపై రూ.5 వేల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

నీటి వృథాపై రూ.5 వేల జరిమానా.. జీడబ్ల్యూఎంసీ కీలక నిర్ణయం
gwmc new rule in water scarcity

వరంగల్, అక్టోబర్ 25: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నీటి ఎద్దడి ఏర్పడుతున్న నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నీటి వృథాపై భారీగా జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.


‘ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నీటి ఎద్దడి ఏర్పడింది. తాగునీరు, సాగునీరు కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఎల్‌నినో ప్రభావం మరింత తీవ్రతరం కాకముందే ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు జీడబ్ల్యూఎమ్‌సీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నీటి వృథాపై రూ.5 వేల జరిమానా విధింపునకు నిర్ణయం తీసుకుంది. ఈ ఆంక్షలను వాటర్ ట్యాంకర్లకు కూడా వర్తింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర జలమండలి సూచనల మేరకు జీడబ్ల్యూఎమ్‌సీ ఈ నిర్ణయం తీసుకుంది’ అని సంబంధిత అధికారులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

తెలంగాణలో కరవుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్

ఎల్‌నినో ప్రభావంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి: సీఎస్ సంజయ్ జాజు

Updated Date - Oct 25 , 2026 | 12:28 PM