Share News

శీతాకాలం... సరస్సు ఖాళీ!

ABN , Publish Date - Oct 25 , 2026 | 11:48 AM

వేసవిలో పచ్చిక మైదానంలా కనిపిస్తుంది. వర్షాకాలంలో సరస్సుగా మారుతుంది. ఇందులో వింతేముంది అంటారా? ఎండలకు సరస్సులో నీరు ఇంకిపోవడం సాధారణమే. కానీ ఈ సరస్సులో నీరంతా అందులో ఉన్న రెండు రంధ్రాల నుంచి భూమి లోపలకు వెళ్లి పోవడం వల్ల... సరస్సు కాస్త మైదానంలా మారుతుంది.

శీతాకాలం... సరస్సు ఖాళీ!
lake, winter season

వేసవిలో పచ్చిక మైదానంలా కనిపిస్తుంది. వర్షాకాలంలో సరస్సుగా మారుతుంది. ఇందులో వింతేముంది అంటారా? ఎండలకు సరస్సులో నీరు ఇంకిపోవడం సాధారణమే. కానీ ఈ సరస్సులో నీరంతా అందులో ఉన్న రెండు రంధ్రాల నుంచి భూమి లోపలకు వెళ్లి పోవడం వల్ల... సరస్సు కాస్త మైదానంలా మారుతుంది. ‘లాస్ట్‌ లేక్‌’ అని పిలిచే ఈ మాయా సరస్సును చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతుంటారు.

అమెరికాకు చెందిన ఒరెగాన్‌ రాష్ట్రంలోని విల్లమెట్‌ నేషనల్‌ ఫారెస్ట్‌లో ‘లాస్ట్‌ లేక్‌’ అనే సరస్సు ఉంది. చుట్టూ మంచుపర్వతాల మధ్యన ఈ సరస్సు అందాలు చూసి తీరాల్సిందే. పర్వతాలపై ఉన్న మంచు కరుగుతూ... చిన్న చిన్న నీటి ప్రవాహాలుగా ఏర్పడి సరస్సు స్వచ్ఛమైన నీటితో కళకళలాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీటి ప్రవాహాలు తగ్గిపోతాయో... అప్పుడు ఆ ప్రాంతం ఆశ్చర్యంగా మైదానంలా మారిపో తుంది. చుక్క నీరు కూడా లేకుండా ఖాళీ అయిపోతుంది. దీనికి ప్రధాన కారణం... సరస్సు మధ్యలో ఉన్న రెండు రంధ్రాల గుండా నీళ్లన్నీ భూమిలోకి వెళ్లడమే. అయితే ఆ నీరు ఎక్కడికి వెళుతుందనేది అంతుచిక్కని రహస్యం. వేసవిలో పచ్చిక మైదానంలా మారే ఆ ప్రదేశంలో ఒక సరస్సు ఉంటుందంటే ఎవరూ నమ్మరు.


book6.jpgఎలా ఏర్పడ్డాయంటే...

లావా ప్రవహించి ఆ తర్వాత చల్లబడి గట్టిపడినప్పుడు ఏర్పడే భూగర్భ మార్గాలనే లావా గొట్టాలు అంటారు. ఈ గొట్టాలు సరస్సు అడుగున శాశ్వతమైన నీటి కాలువల్లా పనిచేస్తాయి. ఇవి నీటిని సులభంగా గ్రహించి, అగ్నిపర్వత శిలల గుండా భూగర్భంలోకి పంపిస్తాయి. అయితే సరస్సులో ఉన్న రంధ్రాలు సుమారు 12 వేల ఏళ్ల క్రితం... ఆ ప్రాంతంలో అగ్నిపర్వతాలలో జరిగిన మార్పుల వల్ల ఏర్పడ్డాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతారు. అవి సరస్సులోని నీటిని నిరంతరం బయటకు పంపిస్తుంటాయి. అయితే మంచు కరిగే కాలంలో పర్వతాల నుంచి వచ్చే నీటి పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సుమారు ఏడు అడుగుల వెడల్పు ఉన్న ఈ రంధ్రాలు నీటిని అంత వేగంగా బయటకు పంపలేవు. కాబట్టి ఆ సమయంలో సరస్సు నీళ్లతో నిండుగా కనిపిస్తుంది. శీతాకాలం చివర్లో నీటి ప్రవాహాలు తగ్గుముఖం పట్టినప్పడు, లాస్ట్‌ లేక్‌ నెమ్మదిగా కనుమరుగవడం ప్రారంభిస్తుంది. సరస్సులోని రంధ్రాలలోకి వెళుతున్న నీరు ఎక్కడికి వెళ్తుందనే విషయం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. అయితే, ఆ నీరు అగ్నిపర్వత శిలల గుండా భూమిలోకి ఇంకిపోయి, ఆ ప్రాంతంలోని భూగర్భ జలాశయాన్ని తిరిగి నింపుతుందని నిపుణులు భావిస్తున్నారు.


book6.3.jpgపర్యాటక ప్రాంతంగా...

వేసవికాలంలో ‘లాస్ట్‌ లేక్‌’ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా మారుతుంది. వింతైన నీటి ప్రవాహాన్ని, రంధ్రాలను చూడటానికి పర్యాటకులు పోటెత్తుతుంటారు. అయితే ఆ వింతను చూసి మురిసిపోకుండా... కొంతమంది సందర్శకులు ఆ రంధ్రాలను మూసివేయడానికి ప్రయత్నిస్తుండటం ఇబ్బందులను సృష్టిస్తోంది. కొందరు పెద్ద పెద్ద రాళ్లు, ఇతర వ్యర్థ పదార్థాలను ఉపయోగించి ఆ రంధ్రాలను మూసివేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఒకవేళ ఆ రంధ్రాలు మూసుకుపోతే సరస్సులో నీరు ఉప్పొంగి చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతిలో మనకు అర్థం కాని ఎన్నో అద్భుతాలు ఉన్నాయనడానికి ఈ సరస్సు చక్కని ఉదాహరణ కదూ!


ఈ వార్తలు కూడా చదవండి:

బంగాళాఖాతంలో తుఫాన్‌!

ఉపాధి హామీలో ఏఐ వెరిఫికేషన్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 11:48 AM