Share News

‘మాయ’ కాదు... వాస్తవ దృశ్యం!

ABN , Publish Date - Oct 25 , 2026 | 10:26 AM

లక్ష్యం చిన్నదో, పెద్దదో... పట్టు వదలకుండా ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు అద్భుతం జరుగుతుంది. మాయా గుప్తా విషయంలో ఇదే రుజువయ్యింది! ఈ యువ డిజిటల్‌ క్రియేటర్‌ విభిన్నమైన ఛాలెంజ్‌తో విఖ్యాత యూట్యూబర్‌ మిస్టర్‌ బీస్ట్‌ ప్రశంసల్ని పొందింది.

‘మాయ’ కాదు... వాస్తవ దృశ్యం!
lifestyle

లక్ష్యం చిన్నదో, పెద్దదో... పట్టు వదలకుండా ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు అద్భుతం జరుగుతుంది. మాయా గుప్తా విషయంలో ఇదే రుజువయ్యింది! ఈ యువ డిజిటల్‌ క్రియేటర్‌ విభిన్నమైన ఛాలెంజ్‌తో విఖ్యాత యూట్యూబర్‌ మిస్టర్‌ బీస్ట్‌ ప్రశంసల్ని పొందింది. భారత్‌ పర్యటనకు వచ్చిన అతడి నుంచి ఏకంగా 10 వేల డాలర్ల నగదు బహుమతినీ గెల్చుకుంది!

సెలబ్రిటీలను కలవడానికీ, వారి దృష్టిని ఆకట్టుకోవడానికీ చాలామంది సోషల్‌ మీడియాలో రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. కానీ గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన మాయా గుప్తా చేపట్టిన ప్రయాణం... కేవలం తను అభిమానించే యూట్యూబ్‌ స్టార్‌ను కలుసుకోవడానికే పరిమితం కాలేదు. సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే సత్సంకల్పంతో ఆమె ముందుకు అడుగువేసింది. అనుకున్నది సాధించింది.


ప్రపంచంలో అతి పెద్ద సంఖ్యలో 52 కోట్లకు పైగా సబ్‌స్ర్కైబర్లు కలిగి ఉన్న అమెరికన్‌ యూట్యూబర్‌ మిస్టర్‌ బీస్ట్‌ (జేమ్స్‌ స్టీఫెన్‌ జిమ్మీ డొనాల్డ్‌సన్‌). 28 ఏళ్ల యువ వ్యాపార వేత్త, పేరుపొందిన దాత కూడా. గ్లోబల్‌ క్రియే టర్లలో స్థానికీకరణ ప్రాధాన్యం గుర్తించిన వారిలో ఇతడొకరు. భారీ బడ్జెట్‌తో తయారయ్యే తన వీడియోలను వివిధ భాషల్లో అనువదించి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లకు చేరువయ్యాడు. భారతీయ వీక్షకులకు సులు వుగా చేరువయ్యేందుకు ప్రత్యేకంగా హిందీ డబ్బింగ్‌ ఆడియో ట్రాక్‌ను ప్రవేశపెట్టాడు.

మిస్టర్‌ బీస్ట్‌ సేవా కార్యక్రమాలు మాయా గుప్తాను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఏడాది వ్యవధిని నిర్దేశించుకుని, ఆలోగా అతడిని కలవాలని సంకల్పించింది. కానీ అతడు ఉండేది అమెరికాలో. తన నివాసమేమో ఇండియా. అయినా ఆమె వెనకంజ వేయలేదు. వ్యక్తిగతమైన అభిమాని కలయికకు... సామాజిక దృక్పథాన్ని కూడా జోడించి 365 రోజుల ఛాలెంజ్‌ను మొదలుపెట్టింది.


book4.2.jpgప్రతీ నిత్యం అదే తపన

ప్రతీరోజూ మిస్టర్‌ బీస్ట్‌ దృష్టిని ఆకర్షించేలా ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌ రూపొందించేది. నిరాశ్రయులకూ, ఆకలితో ఉన్న పేదవారికీ, చిన్నపిల్లలకూ ఆహారాన్నీ, స్నాక్స్‌నూ పంచే కార్యక్రమాలను చేపట్టింది. వాటి ఫొటోలూ, వీడియోలను రోజూ సోషల్‌మీడియాలో పోస్టు చేసేది. ఛాలెంజ్‌ సాగుతున్న రోజు ఎన్నోదో ప్రముఖంగా హైలైట్‌ చేస్తూ... పదోరోజున పదిమందికీ, వందో రోజున వందమందికీ, 300 రోజు 300 మందికీ.. ఇలా విభిన్నమైన రీతిలో సహాయ కార్యక్రమాలను చేపట్టింది. 365 రోజుల ఛాలెంజ్‌ అంత సులువుగా ఏమీ సాగలేదు. ఎన్నోసార్లు ఆమె వీడియోలకు ఆశించిన స్థాయిలో వ్యూస్‌ రాలేదు. పైగా ‘ఇదంతా టైమ్‌ వేస్ట్‌’, ‘బీస్ట్‌కున్న బిజీ షెడ్యూల్‌లో నిన్ను ఎప్పటికీ కలవడు’ అంటూ ప్రతికూల కామెంట్లు రాశారు. ‘‘చాలా రోజులపాటు తీవ్రమైన నిరాశ ఎదురైంది. నేను చేస్తున్నది సరైనదేనా? మిస్టర్‌ బీస్ట్‌ దగ్గరకు నా మాట చేరుతుందా? అని దిగులుపడిన సందర్భాలు న్నాయి. కానీ నేను ఆయన స్వచ్ఛంద సేవాకార్యక్రమాల స్ఫూర్తితో ఈ ఛాలెంజ్‌ మొదలుపెట్టాను. ఫలితం ఎలా ఉన్నా ఏడాది పాటు నా ప్రయత్నం ఆపకూడదని బలంగా నిశ్చయించుకున్నా’’ అని ఆమె చెప్పుకొచ్చింది.

క్రమక్రమంగా ఆన్‌లైన్‌లో చాలామంది ఫాలోయర్లను ఆమె సంపాదించుకుంది. రోజుల్ని లెక్కిస్తూ తన లక్ష్యంవైపు సాగిపోతుండగా చాలామంది ఆ ప్రయాణంలో భాగస్వాములయ్యారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా @mayaforbeast ద్వారా క్రమం తప్పకుండా అప్‌డేట్స్‌ను పంచుకుంటూ వచ్చింది. మొదట్లో చిన్నగా ఆరంభమైన ఈ ప్రయత్నం ఏడాది దగ్గరపడుతుండగా వేల మంది ప్రజలు అనుసరించే స్థాయికి ఎదిగింది.


అనుకోని మలుపు

365వ రోజు వచ్చేసింది. చివరిరోజు ఓ అద్భుతమైన మలుపు... ఆమె జీవితంలో మరిచిపోలేని మధురానుభూతిని మిగిల్చింది. ఎప్పటిలాగే కెమెరా ముందు నిలబడి తన రోజువారీ ప్రయత్నాన్ని రికార్డు చేస్తున్న సమయంలో ఊహించని విధంగా స్వయంగా మిస్టర్‌ బీస్ట్‌ ఆమె దగ్గరకు నడిచి వచ్చాడు. ఆమెను దగ్గరకు తీసుకుని, ఏడాది పాటు ఒక్కరోజు కూడా విడవకుండా ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తిచేసినందుకు అభినందిం చాడు. సమాజానికి మేలు చేసే వారిని ప్రోత్స హించే అలవాటున్న మిస్టర్‌ బీస్ట్‌ తన అభి మానికి 10 వేల డాలర్లున్న సూట్‌ కేసును బహుమతిగా అందించాడు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 9.67 లక్షలు! ‘‘నా ఎదురుగా మిస్టర్‌ బీస్ట్‌ నిలబడి ఉన్నారంటే నమ్మలేకపోయాను. ఆయనిచ్చిన గిఫ్ట్‌ ఓ కానుక మాత్రమే కాదు. గడిచిన 365 రోజుల్లో ఎదుర్కొన్న సందేహాలకు సమాధానం. పడిన శ్రమకు లభించిన పెద్ద గుర్తింపు. ఈ మొత్తాన్ని సమాజంలో మరింతమందికి సహాయం చేయడానికీ, ఆకలి తీర్చడానికీ తప్ప కుండా ఉపయోగిస్తా’’ అని ప్రకటించింది మాయా గుప్తా. తాను మాయాను కలుసుకుప్పటి వీడియోను మిస్టర్‌ బీస్ట్‌ ఇన్‌స్టాలో పోస్టు చేస్తే... దాన్ని 4 కోట్ల మందికి పైగా వీక్షించడం విశేషం.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగాళాఖాతంలో తుఫాన్‌!

ఉపాధి హామీలో ఏఐ వెరిఫికేషన్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 10:26 AM