కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు, మహిళ మృతి
ABN , Publish Date - Oct 25 , 2026 | 09:55 AM
కృష్ణా జిల్లాలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
కృష్ణా జిల్లా, అక్టోబర్ 25: జిల్లాలోని విజయవాడ-మచిలీపట్నం హైవేపై ఈ రోజు( ఆదివారం) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..
పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణాజిల్లాలో జగ్గయ్యపేటకు చెందిన ఓ కుటుంబం.. ఈ రోజు తెల్లవారుజామున స్వగ్రామం నుంచి మోపిదేవికి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు విజయవాడ-మచిలీపట్నం హైవేపై వెళ్తుండగా.. గుడివాడ ఫ్లైఓవర్ సమీపాన గల పామర్రుకు చేరుకోగానే.. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒరుసు చిన్న తిరుపతమ్మ(60) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన కుటుంబసభ్యులకు స్వల్పగాయాలయ్యాయి. గమనించిన వాహనదారులు హుటాహుటినా క్షత్రగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేపట్టారు.
ఈ వార్తలనూ చదవండి: