Share News

వైభవ్‌ను వన్‌డౌన్‌లో ఆడించడం సరైన నిర్ణయం కాదు: అశ్విన్

ABN , Publish Date - Oct 25 , 2026 | 10:26 AM

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కినా.. బ్యాటింగ్‌లో మాత్రం నిరాశే ఎదురైంది. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. వైభవ్‌ను వన్‌డౌన్‌లో ఆడించడం సరైన నిర్ణయం కాదని తేల్చి చెప్పాడు.

వైభవ్‌ను వన్‌డౌన్‌లో ఆడించడం సరైన నిర్ణయం కాదు: అశ్విన్
Ravichandran Ashwin

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో రెండో టీ20లో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కినా.. బ్యాటింగ్‌లో మాత్రం నిరాశే ఎదురైంది. గాయపడిన ఇషాన్‌ కిషన్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన వైభవ్‌ను.. మేనేజ్‌మెంట్‌ నంబర్‌-3 స్థానంలో ఆడించింది. 8 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. వైభవ్‌ను వన్‌డౌన్‌లో ఆడించడం సరైన నిర్ణయం కాదని తేల్చి చెప్పాడు.


‘సాధారణంగా ఓపెనర్‌గా వచ్చి దూకుడుగా ఆడే వైభవ్ సూర్యవంశీ.. వన్‌డౌన్‌లో మాత్రం తడబడ్డాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ ప్రదర్శన హిట్టా? ఫట్టా? అని నన్ను అడిగితే.. ఫట్ అనే చెప్తాను. అయితే ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో యువ బ్యాటర్‌ను అంచనా వేయడం తొందరపాటే అవుతుంది. వైభవ్‌ వరుసగా భారీ షాట్లకు ప్రయత్నిస్తూ ఒత్తిడికి లోనైనట్లు కనిపించాడు. అలాంటి సమయంలో క్రీజులో ఉన్న సీనియర్‌ బ్యాటర్‌ అతడి వద్దకు వెళ్లి కాస్త ప్రశాంతంగా ఆడాలని సూచించి ఉంటే బాగుండేది. బంతిని దగ్గరగా గమనిస్తూ, తన సహజమైన ఆటను ఆడేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆరో ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగడం వైభవ్‌కు అలవాటు లేని పాత్ర. అది అతడికి సెట్ అవ్వలేదు’ అని అశ్విన్ వివరించాడు.


సంజును నంబర్‌-3లో ఆడించాలి..

‘వైభవ్‌ సూర్యవంశీ, అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌.. ఈ ముగ్గురినీ తుది జట్టులో కొనసాగించాలనుకుంటే బ్యాటింగ్‌ స్థానాల విషయంలో మార్పులు చేయాలి. అభిషేక్‌, వైభవ్‌లను ఓపెనర్లుగా పంపి.. సంజును వన్‌డౌన్‌లో ఆడించడం మేలు. గతంలో ఆసియా క్రీడల్లోనూ సంజు మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేశాడు. టీమ్ మేనేజ్‌మెంట్‌ ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’ అని అశ్విన్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

డిసెంబర్‌లోపు నిర్ణయం తీసుకుంటా.. ఐపీఎల్‌లో ఆడటంపై ధోని బిగ్ హింట్!

కివీస్‌పై భారత్ ఉత్కంఠ విజయం.. తిలక్, నితీశ్ పోరాటానికి గంభీర్ ఫిదా!

Updated Date - Oct 25 , 2026 | 10:26 AM