బేస్‌బాల్ లీగ్‌లో భారత క్రికెటర్లు.. సూర్యకుమార్ జట్టుదే విజయం!
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:19 PM
మేజర్ బేస్‌బాల్ లీగ్‌లో టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ సహా పలువురు ప్లేయర్లు సందడి చేశారు. ముంబైలోని అంధేరీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉన్న ఫుట్‌బాల్ అరేనాలో 3 ఆన్ 3 బేస్‌బాల్ పోటీలు జరిగాయి.
ఇంటర్నెట్ డెస్క్: మేజర్ బేస్‌బాల్ లీగ్‌లో టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ సహా పలువురు ప్లేయర్లు సందడి చేశారు. ముంబైలోని అంధేరీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉన్న ఫుట్‌బాల్ అరేనాలో 3 ఆన్ 3 బేస్‌బాల్ పోటీలు జరిగాయి. ఈ టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహించిన న్యూయార్క్ యాంకీస్ జట్టు విజేతగా నిలిచింది.
MLB తొలిసారిగా నిర్వహించిన ఈ బేస్‌బాల్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆటగాళ్లను నాలుగు జట్లుగా విభజించారు. అమెరికా బేస్‌బాల్ చరిత్రలో పేరొందిన కబ్స్, డాడ్జర్స్, రెడ్ సాక్స్, యాంకీస్ జట్ల పేర్లను వీటికి పెట్టారు. భారత క్రికెటర్లలో సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జితేశ్ శర్మ, కాశ్వీ గౌతమ్, దీపక్ చాహర్, రాధా యాదవ్ పాల్గొన్నారు. MLB మాజీ స్టార్లు నిక్ స్విషర్, జేక్ అరియెటా, అడ్రియన్ గొంజాలెజ్ తదితరులు కూడా ఈ పోటీలో ఆడారు. శార్దూల్ ఠాకూర్.. షికాగో కబ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచ్‌లో అతడు వరుసగా 3 హోమ్ రన్స్ సాధించడం విశేషం.
ఇవి కూడా చదవండి:
రోహిత్, కోహ్లీ, బుమ్రాలకు నో ప్లేస్.. రహానె ఆల్‌టైమ్ భారత టెస్టు జట్టు ఇదే!
వైభవ్‌ను వన్‌డౌన్‌లో ఆడించడం సరైన నిర్ణయం కాదు: అశ్విన్