Share News

పాతుకుపోతున్న గన్‌మెన్‌లు

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:04 PM

ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారుల వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వర్తించే ఏఆర్‌ సిబ్బంది ఏళ్లుగా ఒక దగ్గరే పాతుకుపోతూ ప్రజాప్రతినిధుల పలుకుబడితో పైరవీలకు పాల్పడుతూ నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నట్లుగా తెలు స్తోంది.

పాతుకుపోతున్న గన్‌మెన్‌లు
Gunmens, Warangal

  • ఏఆర్‌ అధికారులను మచ్చిక చేసుకొని ఏళ్లుగా వీఐపీల వద్ద విధులు

వరంగల్‌: ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారుల వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వర్తించే ఏఆర్‌ సిబ్బంది ఏళ్లుగా ఒక దగ్గరే పాతుకుపోతూ ప్రజాప్రతినిధుల పలుకుబడితో పైరవీలకు పాల్పడుతూ నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నట్లుగా తెలు స్తోంది. నిబంధనల ప్రకారం ఒక దగ్గర 6 నెలల కన్నా ఎక్కువ రోజుల విధులు నిర్వర్తించొద్దు అయినప్పటికీ గన్‌మెన్‌లకు ఇన్‌చార్జిగా ఉన్న రిజర్వుడ్‌ ఇన్స్‌పెక్టర్‌తోపాటు ఆపై స్థాయి అధికారులు చూసీచూడన ట్లుగా వ్యవహరిస్తూ నిబంధనలకు పాతర వేస్తున్నారు.


వరంగల్‌ కమిషనరేట్‌లో పరిధిలో సుమారు 8 మంది ఎమ్మెల్యేతో పాటు ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్సీలు, ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌తో పాటు కొంతమంది మాజీ ప్రజాప్రతినిధుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 3+3, 2+2, మరొక దగ్గర 1+1 విధానంలో సుమా రు 160 మంది వరకు గన్‌మెన్‌లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో కొంతమంది వీఐపీలకి సెక్యూరిటీ ఇవ్వడం వరకే పరిమితం కాకుండా వారి వ్యక్తిగత పనులను సైతం చక్కదిద్దుతూ పైరవీల కు పాల్పడుతున్నట్లు విశ్వసనీయమైన సమాచారం.


hnk2.4.jpgకొంతమంది పీఎస్‌వోలు అయితే ప్రజాప్రతినిధుల దగ్గరకు వచ్చే ద్వితీయశ్రేణి నాయకులతో దోస్తాన్‌ చేస్తూ వీఐపీ సమాచారం ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తూ రెస్ట్‌వచ్చిన రోజు వారితో విందు, మద్యంలో మునిగి తేలుతున్నట్లుగా తెలుస్తోంది. మరికొంత మంది అయితే గుత్తేదారులతో పాటు ప్రజాప్రతినిధుల దగ్గరికి రెగ్యులర్‌గా పనుల కోసం వచ్చే వ్యక్తుల నుంచి వీఐపీని కల్పిస్తున్నామన్న పేరుతో ఎంతోకొంత డబ్బులను వసూలు చేసి అక్కడ పనిచేసే వ్యక్తిగత సిబ్బందితో కలిసి పంచుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీస్‌బాస్‌ ఈ విషయంపై దృష్టిసారించి ఆరు నెలల నిబంధనను పకడ్బందీగా అమలు చేస్తే గన్‌మెన్‌ల వ్యవస్థపై విమర్శలు రాకుండా మెరుగు పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

కూరగాయలు కాదు.. కాలకూట విషం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 12:04 PM