బీఏసీలోనే క్లియర్‌గా చెప్పాం.. డీఎస్సీపై చర్చకు సిద్ధం: మంత్రి పయ్యావుల
ABN , Publish Date - Aug 18 , 2026 | 10:55 AM
ఏపీ శాసనమండలి సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే డీఎస్సీపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు.
అమరావతి, ఆగస్టు 18: ఏపీ శాసనమండలి సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే డీఎస్సీపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో సభలో వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి బల్లలు చరుస్తూ ఆందోళనకు దిగారు. నిరసనల మధ్యే చైర్మన్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. డీఎస్సీపై శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇచ్చారు.
DSCపై మండలిలో చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలి అనే నిర్ణయాన్ని ప్రజలు తమకు అప్పజెప్పారన్నారు. ‘మీరు కోరుకున్నట్టు ప్రభుత్వం నడవదు. నిన్న BAC లోనే మేము క్లియర్‌గా చెప్పాం. DSCపై చర్చకు సిద్ధమని నిన్న బీఏసీలోనే చెప్పాం. చైర్మన్ పోడియం ఎక్కడం మంచిది కాదు’ అని మంత్రి చెప్పారు.
ప్రశ్నోత్తరాల అనంతరం బీఏసీకి పిలుస్తామని వైసీపీ సభ్యులతో చైర్మన్ అన్నారు. అయితే ఇప్పుడే డీఎస్సీకి పిలవాలని ప్రతిపక్ష నేత బొత్స పట్టుపట్టారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత పిలుస్తానమని చైర్మన్ చెప్పినప్పటికీ.. వైసీపీ సభ్యుల నినాదాలు ఆగని పరిస్థితి నెలకొంది. దీంతో సభను చైర్మన్ కొద్దిసేపు వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి...
రెండో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
మత్స్యకారుల గల్లంతు ఘటన.. గాలింపు చర్యలను ముమ్మరం చేయాలంటూ సీఎం ఆదేశాలు
Read Latest AP News And Telugu News