రెండో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
ABN , Publish Date - Aug 18 , 2026 | 09:43 AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు మొదలయ్యాయి. శాసనసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. నియోజకవర్గాల సమస్యలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు.
అమరావతి, ఆగస్టు 18: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు మొదలయ్యాయి. శాసనసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. నియోజకవర్గాల సమస్యలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. 25,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను పురపాలక సంఘాలుగా స్థాయీకరించే ప్రతిపాదన ఏదీ లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ అంశంపై సభలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
జనాభా లెక్కల ప్రక్రియ 2027, మార్చి 31 వరకూ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అప్పటి వరకూ ఎలాంటి మార్పులు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించిందన్నారు. ఆ తర్వాత మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించే అంశాన్ని పరిశీలించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
విడాకులివ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20 శాతం కోత
Read Latest AP News And Telugu News