విడాకులివ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20 శాతం కోత
ABN , Publish Date - Aug 18 , 2026 | 06:21 AM
బహుభార్యత్వాన్ని నిషేఽధించే దిశగా చర్యలు చేపడుతున్న అసోం సర్కారు.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా...
అసోం సర్కారు కీలక నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపు
గువాహటి, ఆగస్టు 17: బహుభార్యత్వాన్ని నిషేఽధించే దిశగా చర్యలు చేపడుతున్న అసోం సర్కారు.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకునే ప్రభుత్వ ఉద్యోగుల జీతం నుంచి 20 శాతం కోత పెట్టి.. ఆ మొత్తాన్ని మొదటి భార్య ఖాతాకు జమ చేయనున్నట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. ఇందుకు మొదటి భార్య ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ జీతంలో కోత కొనసాగుతుందన్నారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యేవరకు ఇబ్బందులు పడకుండా మొదటి భార్యకు ఆర్థిక సహకారం అందించాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. అలాగే ప్రైవేటు రంగ ఉద్యోగులకూ ఈ నిర్ణయాన్ని వర్తింపజేసేందుకు యోచిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే వృద్ధ తల్లిదండ్రులను, దివ్యాంగ తోబుట్టువులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 10% కోత విధించి.. ఆ మొత్తాన్ని వారి ఖాతాలకే నేరుగా జమ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి
పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి
స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా