పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Aug 17 , 2026 | 08:27 PM
తెలంగాణ ప్రజా పాలనలో విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు, పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రజా పాలనలో విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు, రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
పేదల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత
పేదల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత 32 నెలల్లో ఆరోగ్యశ్రీ కోసం రూ.2,600 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వ ఆస్పత్రుల సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నామని తెలిపారు.
టిమ్స్ ద్వారా పేదలకు మెరుగైన వైద్యం
తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రులు పేదలకు ఎంతో ఉపయోగపడతాయని సీఎం అన్నారు. గత పాలకులు టిమ్స్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులను మర్చిపోయారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో మూడు టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాన్ని వేగంగా చేపట్టామని తెలిపారు. అదే విధంగా వరంగల్‌లోనూ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు.
2027 డిసెంబర్ నాటికి ఆస్పత్రుల నిర్మాణం పూర్తి
2027 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఆస్పత్రులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఆరు నెలలకు ఒక ఆస్పత్రిని ప్రారంభించే దిశగా ప్రణాళిక రూపొందించామని సీఎం వెల్లడించారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తోందని తెలిపారు. ఆస్పత్రుల నిర్మాణ పనులు వేగంగా, నాణ్యతతో పూర్తయ్యేలా ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణ చేపడుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
Also Read:
తెలంగాణలో SIR ముసాయిదా విడుదల..
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్