Share News

జ్వరంతో ఆస్పత్రిలో చేరిన మహిళ మృతి.. బంధువుల ఆందోళన

ABN , Publish Date - Aug 18 , 2026 | 10:14 AM

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిందంటూ ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు.

జ్వరంతో ఆస్పత్రిలో చేరిన మహిళ మృతి.. బంధువుల ఆందోళన
Hyderabad news

హైదరాబాద్, ఆగస్టు 18: నగరంలోని అత్తాపూర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిందంటూ ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. శ్రీలత(28) అనే మహిళ.. జ్వరం కారణంగా నిన్న(సోమవారం) ప్రైవేటు హాస్పిటల్‌లో చేరింది. నిన్నటి నుంచి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. అయితే రాత్రి పరిస్థితి విషమంగా ఉందంటూ ఐసీయూకు తరలించిన వైద్యులు.. ఆ తర్వాత శ్రీలత మృతి చెందినట్లు ప్రకటించారు. మహిళ మృతితో కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.


వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందంటూ బంధువులు ఆరోపించారు. మృతురాలి బంధువులు.. ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆస్పత్రి వద్ద బందోబస్తు నిర్వహించారు. మృతురాలి బంధువులకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

రెండో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

మత్స్యకారుల గల్లంతు ఘటన.. గాలింపు చర్యలను ముమ్మరం చేయాలంటూ సీఎం ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 10:14 AM