రెండో రోజూ ‘ఐ యామ్ వెయిటింగ్’.. డీఎస్సీపై మంత్రి లోకేశ్ ఎక్స్ పోస్టు..
ABN , Publish Date - Aug 18 , 2026 | 09:34 AM
డీఎస్సీ అంశంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేశ్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని సవాల్ చేసిన లోకేశ్.. జగన్ సమాధానం కోసం రెండో రోజూ ఎదురుచూస్తున్నానంటూ సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు.
అమరావతి: డీఎస్సీ అంశంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేశ్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని సవాల్ చేసిన లోకేశ్.. జగన్ సమాధానం కోసం రెండో రోజూ ఎదురుచూస్తున్నానంటూ సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశంపై జగన్ చర్చకు వస్తారా? అంటూ గతంలోనే ప్రశ్నించిన ఆయన.. తాజాగా తన నిరీక్షణను తెలియజేస్తూ ఆసక్తికరమైన పోస్టు పెట్టారు.
ఈ సందర్భంగా ‘మిస్టర్ బీన్’ మీమ్‌ను మంత్రి లోకేశ్ షేర్ చేశారు. వైసీపీ కోసం ‘ఐ యామ్ వెయిటింగ్’ అనే భావన వచ్చేలా మీమ్‌ను రూపొందించి పోస్టు చేశారు. డీఎస్సీ అంశంపై చర్చకు జగన్ స్పందించకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఈ పోస్టు చేశారు. దీనిని ‘#DSCFakesByYCP’ హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. డీఎస్సీ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఇప్పటికే రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో లోకేశ్ తాజా సవాల్‌పై వైఎస్ జగన్, వైసీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి