భూపాలపల్లి జిల్లాలో విషాదం.. కోతుల దాడిలో వ్యక్తి మృతి
ABN , Publish Date - May 01 , 2026 | 10:02 AM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన అత్యంత విషాదకరం. కోతుల దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
జయశంకర్ భూపాలపల్లి, మే1 (ఆంధ్రజ్యోతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన అత్యంత విషాదకరం. కోతుల దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. భూపాలపల్లి పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో ఈ విషాద ఘటన జరిగింది. హరికృష్ణ అనే వ్యక్తి రోజువారీ పనుల్లో ఉండగా, ఒక్కసారిగా కోతుల గుంపు ఆయనపై దాడికి దిగాయి. కోతులు వెంటాడటంతో భయాందోళనకు గురైన హరికృష్ణ, వాటి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. తప్పించుకునే ప్రయత్నంలో హరికృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం ఎక్కువగా కావడంతో, స్థానికులు ఆస్పత్రికి తరలించే లోపే ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
పెరుగుతున్న కోతుల బెడద
ఈ ఘటనపై జవహర్ నగర్ కాలనీ వాసులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. కాలనీల్లో కోతుల సంఖ్య విపరీతంగా పెరగుతోందని.. అవి మనుషులపై దాడి చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కోతుల బెడద గురించి గతంలో ఫిర్యాదులు చేసినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. అటవీ శాఖ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో కోతులను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే వానరాలను పట్టుకోవాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సంక్షేమ పథకాల్లో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం అమలు చేయాలి: సీఎం
పిల్లల దత్తత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And International News And Telugu News