సన్న వరిపై పక్కా లెక్క
ABN , Publish Date - Aug 04 , 2026 | 01:44 PM
సన్నరకం వరిపై లెక్కలు ప్రారంభమయ్యాయి. సన్నాలకు ఇచ్చే బోనస్ దుర్వినియోగం కాకుండా, దళారుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు 2026 వానాకాలం సీజన్ నుంచి ప్రత్యేక విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.
వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం
విత్తన కొనుగోలు నుంచే ఆన్‌లైన్‌లో నమోదు
డీలర్లకు ఆదేశాలు జారీ
నమోదు కాని రైతులకు బోనస్ లేనట్లే
వరంగల్: సన్నరకం వరిపై లెక్కలు ప్రారంభమయ్యాయి. సన్నాలకు ఇచ్చే బోనస్ దుర్వినియోగం కాకుండా, దళారుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు 2026 వానాకాలం సీజన్ నుంచి ప్రత్యేక విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. సన్నరకం సాగు చేస్తున్న రైతులు విత్తనాల కొ నుగోలు నుంచే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖాధికారులకు ఆ దేశాలు జారీ చేసింది. జిల్లాలో ఎన్ని ఎకరాల్లో సన్నరకం వరి సాగువుతున్నది స్పష్టంగా నిర్ధారించేందుకు విత్త నాల కొనుగోలు నుంచే లెక్కల వివరాలను ఎప్పటి కప్పుడు డీలర్లు ఆన్లై న్లో నమోదు చేయాలని ఆదేశించింది.
వ్యవసాయ విస్తరణాధి కారుల వద్ద ఉన్న లెక్కలతో ఇవి సరిపోలాలని, ఏ మాత్రం తేడా ఉండరాదని పేర్కొంది. డీలర్ల వద్ద కాకుండా సొంతంగా విత్త నాలు దాచుకుని సాగుచేసే రైతులు తమ పరిధిలోని ఏఈవో ద్వారా యా ప్‌లో నమోదు చేసుకునే వెసులు బా టును కూడా కల్పించింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. 2026 వానాకాలం సీజన్‌లో నిర్దేశిత ఏడు రకాల సన్నవరి పంటలకే ప్రభుత్వం బోనస్ చెల్లించనుంది.
ఎక్కడ కొన్నా..
రైతులు రాష్ట్రంలో ఎక్కడ విత్తనాలు కొనుగో లు చేసినా ఆ వివరాలను జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి పంపిస్తారు. దీంతో సన్నరకం సాగు వివరాలు పక్కాగా తెలియనున్నాయి. దుకాణాదారులు ఈ ప్రక్రియను సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అనేది మండలస్థాయి వ్యవసాయాధికారులు పర్యవేక్షణ చేస్తారు. ఇప్పటికే కొనుగోలు చేసిన వరి విత్తనాల రకాలను సైతం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలను ఏఈవోలు పంటల నమోదులో సరిచేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆన్‌లైన్‌లో విత్తన కొనుగోలు నమోదు చేయని రైతులకు బోనస్ రాదని అధికారులు చెబుతున్నారు.
ఆన్‌లైన్‌లో నమోదుకు ప్రభుత్వం ప్రత్యేకంగా httttp://see dsgrower p.com/seedssales/login.php వైబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. డీలర్లు సులభంగా లాగిన్ కావడానికి వీలుగా క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని కూడా కల్పించింది. డీలర్లు ఈ సైట్లో సన్నరకం వరి రకాల అమ్మకాల ఆప్షన్‌ను ఎంచుకొని కొనుగోలు చేసిన రైతు పేరు, తండ్రి పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ వంటి ప్రాథమిక వివరాలతో పాటు విత్తనరకం, కంపెనీ పేరు, లాబ్ నెంబర్, సీడ్ ప్యాకెట్, సైజ్, కొనుగోలు చేసిన తేదీని ఖచ్చితంగా నమోదు చేయాలి. డిజిటల్ నమోదు ప్రక్రియ కేవలం 2026 వానాకాలం సీజన్లో విక్రయించే విత్త నాలకు మాత్రమే వర్తిస్తుందని, ప్రభుత్వం విధించిన గడువు లోపలే డీలర్లు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని వ్యవసాయ కమిషనరేట్ స్పష్టం చేసింది.
ఏడు సన్న రకాలు
తెలంగాణ సోన (15048) పంట కాలం 120నుంచి 125 రోజులు. సాం బమసూరి (బీపీటీ5204) పంట కాలం 145 నుంచి 150 రోజులు. కేఎన్‌ఎం(1638) పంట కాలం 125 నుంచి 130 రోజులు. హెచ్‌ఎంటీ సోన పంట కాలం 135 నుంచి 145 రోజులు. జై శ్రీరాం పంట కాలం 125 నుంచి 135 రోజులు. డబ్ల్యూజీ ఎల్ 44 పంట కాలం 130 నుంచి 145రోజులు. కెఎన్‌ఎం(7715) పంటకాలం 125నుంచి 130 రోజులు.
ఈ వార్తలు కూడా చదవండి:
అన్నదాతకు వరం.. పీఎం కిసాన్ మాన్‌ధన్
హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 5న తాగునీటి సరఫరా బంద్
Read Latest AP News And Telangana News And International News And Telugu News