Share News

పీవీఎన్‌ఆర్‌ ఓపెన్‌కాస్టు గని భవితవ్యం ప్రశ్నార్థకం

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:46 AM

ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలో ప్రతిపాదించిన పీవీ నరసింహరావు(పీవీఎన్‌ఆర్‌) ఓపెన్‌కా్‌స్ట ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

పీవీఎన్‌ఆర్‌ ఓపెన్‌కాస్టు గని భవితవ్యం ప్రశ్నార్థకం
Singareni

  • గని వల్ల రామప్ప ఆలయానికి ముప్పు అన్న అభ్యంతరాలతో ఎన్జీటీ సుమోటో విచారణ

  • ఇప్పటికే స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత

  • గనితో రామప్పకు ముప్పు లేదన్న సింగరేణి

ములుగు, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలో ప్రతిపాదించిన పీవీ నరసింహరావు(పీవీఎన్‌ఆర్‌) ఓపెన్‌కా్‌స్ట ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. రామప్ప ఆలయ పరిరక్షణ కమిటీ, స్థానికుల ఆందోళనలతో జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) ఈ ప్రాజెక్టును సుమోటోగా విచారణకు స్వీకరించడంతో అసలు ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తుందా.. అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుమారు 40.43 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలను వెలికి తీయాలనే లక్ష్యంతో సింగరేణి సంస్థ 2021లో పీవీఎన్‌ఆర్‌ ఓపెన్‌కా్‌స్ట ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఈ గనికి సమీపంలోనే ఉంది. ఓపెన్‌ కాస్టు గనుల్లో భారీ పేలుళ్లు, ఫలితంగా సంభవించే భూప్రకంపనల వల్ల ఆలయ శాండ్‌బాక్స్‌ పునాదులు దెబ్బతినే ప్రమాదం ఉందని చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


గని వల్ల రామప్ప సరస్సు పరీవాహక ప్రాంతం, నీటి ప్రవాహ మార్గాలు దెబ్బతింటాయని, సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతాయని రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గని విస్తరణ కోసం వేలాది ఎకరాల వ్యవసాయ భూములను సేకరించాల్సి రావడం వల్ల స్థానికులు జీవనోపాధి కోల్పోతారన్న భయాలు ఉన్నాయి. అందుకే ఈ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని అక్కడివారు డిమాండ్‌ చేస్తున్నారు. తవ్వకాల వల్ల కలిగే పర్యావరణ, భౌగోళిక ప్రభావాలపై స్వతంత్ర సంస్థలతో సమగ్ర అధ్యయనాలు నిర్వహించి, ఆ నివేదికలను బహిరంగపర్చాలని కోరుతున్నారు.


రామప్పకు ఎలాంటి ముప్పు లేదు: సింగరేణి

పీవీఎన్‌ఆర్‌ గని వల్ల రామప్ప ఆలయానికి ఎలాంటి ప్రమాదం ఉండదని శాస్త్రీయ అధ్యయనాల్లో తేలినట్లు సింగరేణి అధికారులు చెబుతున్నారు. స్థానికులు, చరిత్రకారుల అభ్యంతరాలపై భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. రామప్ప దేవాలయ భద్రతపై ఐఐటీ మద్రాస్‌ లాంటి ప్రముఖ సంస్థలతో అధ్యయనాలు చేయించి, ఆ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. ఆ అధ్యయనాల ప్రకారం రామప్పకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. భారత పురావస్తు శాఖ(ఏఎ్‌సఐ) నిబంధనలకు అనుగుణంగానే ఈ అధ్యయనాలు జరిగాయన్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైల్‌ ములుగు కలెక్టర్‌ వద్ద ఉందని, ఆయన నుంచి ఎన్‌వోసీ రాగానే అధ్యయన నివేదికలను భారత పురావస్తు శాఖకు పంపిస్తామని చెప్పారు. ఎన్జీటీ సుమోటో కేసుకు సంబంధించి తమకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!

రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్‌!

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 05:46 AM