Share News

విద్యుత్‌ చార్జీలు పెంచేది లేదు..

ABN , Publish Date - Mar 07 , 2026 | 11:04 AM

రాబోయే ఆర్థిక సంవత్సరం (2026-27)లో విద్యుత్‌ బిల్లుల టారిఫ్‌లో ఎలాంటి పెంపుదల లేదని టీజీఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి స్పష్టం చేశారు.

విద్యుత్‌ చార్జీలు పెంచేది లేదు..

  • గ్రీన్‌ టారిఫ్‌, ఓపెన్‌ యాక్సెస్‌లో స్టాండ్‌బై చార్జీలు యథాతథం

  • రూ.22,754 కోట్ల సమగ్రాదాయంలో రూ.12,521కోట్ల రెవెన్యూ లోటు

  • లోటును సబ్సిడీ రూపంలో ఇచ్చేందుకు ప్రభుత్వ సహకారం కోరాం.

  • టీజీఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి

  • విద్యుత్‌ నియంత్రణ మండలి బహిరంగ విచారణ

  • వైఫల్యాలను ఎత్తిచూపిన భిన్నవర్గాల ప్రతినిధులు

రాంనగర్‌ (హనుమకొండ): రాబోయే ఆర్థిక సంవత్సరం (2026-27)లో విద్యుత్‌ బిల్లుల టారిఫ్‌లో ఎలాంటి పెంపుదల లేదని టీజీఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి స్పష్టం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రిటైల్‌ విద్యుత్‌ సరఫరా వ్యాపారం కోసం సవరణ చేయబడిన సమగ్ర ఆదాయ అవసరాలు, విద్యుత్‌ ధరల ప్రతిపాదనలు, ఓపెన్‌ యాక్సెస్‌ వినియోగదారులపై క్రాస్‌ సబ్సిడీ సర్‌ చార్జీల ప్రతిపాదనలపై తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లో విచారణ నిర్వహించింది. మండలి చైర్మన్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌, మెంబర్‌ ఫైనాన్స్‌ చెరుకూరి శ్రీనువాస్‌రావు, మెంబర్‌ టెక్నికల్‌ కంచెర్ల రఘు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎన్పీడీసీఎల్‌ సీఎండీ మాట్లాడుతూ.. గ్రీన్‌ ఎనర్జీ ప్రోత్సాహకంలో భాగంగా గ్రీన్‌ ఎనర్జీని ఎంచుకునే ఎల్‌టీ, హెచ్‌టీ వినియోగదారులకు సాధారణ టారిఫ్‌ కంటే యూనిట్‌కు 0.66 గ్రీన్‌ టారిఫ్‌ కొనసాగి స్తున్నట్లు వెల్లడించారు. పరిశ్రమల్లోని టైం ఆఫ్‌ డే ధరల్లో సైతం ఎలాంటి మార్పు లేదన్నారు. ఓపెన్‌ యాక్సెస్‌ ఎనర్జీ మేరకు సంబంధిత వినియోగదారులకు వర్తించే ఎనర్జీ చార్టీల్లో 10 శాతం చొప్పున స్టాండ్‌ బై చార్జీల విధింపు కొనసాగిస్తామన్నారు. ఎన్పీడీసీఎల్‌ వ్యాప్తంగా 70 లక్షల 29 వేల వినియోగదారులు ఉండగా, తలసరి విద్యుత్‌ విని యోగం 1,680 యూనిట్లు ఉందన్నారు. ఆర్థిక సంవత్సరా నికి రూ.22,754 కోట్ల సమగ్ర ఆదాయ ఆవశ్యకత ఉండగా, దీనిలో రూ.12,521 కోట్ల రెవెన్యూ లోటు ఉందని, లోటు బడ్జెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో మద్దుతు కావాలని కమిషన్‌ను ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం కోరింది. ఎన్పీడీసీఎల్‌ పరిధిలో నాణ్యమైన విద్యుత్‌ కోసం కంపెనీ చేపట్టిన అంశాలను మండలితో పాటు విని యోగదారులకు వివరించింది.


hnk2.2.jpgకంపెనీ వైఫల్యాలు

బహిరంగ విచారణకు హాజరైన వినియోగదారుల్లో కొంతమంది ఎన్పీడీసీఎల్‌ తీరును ప్రశంసించగా.. మరి కొంతమంది వైఫల్యాలను ఎత్తి చూపారు. భారత్‌ కిసాన్‌ సంఘ్‌ నుంచి హాజరైన రాము మాట్లాడుతూ.. సీజీఆర్‌ఎఫ్‌ లో అధిక ప్రాధాన్యత విద్యుత్‌శాఖకు సంబంధించి అధికారులే ఉండటం వల్ల కంపెనీకి వత్తాసు పలుకుత ున్నారు తప్ప.. వినియోగదా రుల పక్షాన నిలబడటం లేదన్నారు. విద్యుత్‌ నియంత్రణ మండలి సమావే శాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి వినియో గదారుల సమస్యలు తెలుసుకోవాలన్నారు. విద్యుత్‌ ప్రమాదాల బారినపడి మరణించే కుటుంబాలు ఎక్స్‌గ్రేషి యా కోసం దరఖాస్తు చేసుకునేవరకు వేచి చూడకకుండా సత్వరమే స్పందించి ఆర్థిక సహాయం అందజేయాలన్నారు.


తెలంగాణ కాటన్‌ మిల్లర్స్‌ అండ్‌ ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చింతలపల్లి వీరారావు మాట్లాడుతూ.. వ్యవసాయ ఆధారిత పరిశ్రమ లకు సబ్సిడీని ఇవ్వాలని, ఆఫ్‌ సీజన్‌ పీరియడ్‌ నిబంధనలను సవరిం చాలని విజ్ఞప్తి చేశారు.

అదే విధంగా 2012లో ఎంఎస్సీ సేకరణ కోసం మిల్లులు నడిపిన సమయంలో హెచ్‌టీ వినియోగదా రులపై వేసిన ఫీనల్‌ చార్జీలను రద్దు చేయాలని కోరగా.. సీఎండీ స్పందిస్తూ త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి జలగం ప్రసాదరావు మాట్లాడుతూ.. సబ్‌స్టేషన్‌ల ఆపరేటర్లను నియమించాలని, భద్రాద్రి కొత్తగూడెం గుండాలలో 132 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మేము ఎలాంటి అపచారం చేయలేదు: దువ్వాడ శ్రీనివాస్, మాధురి

కాంగ్రెస్‏ది ప్రతీకార పాలన

Read Latest Telangana News and National News

Updated Date - Mar 07 , 2026 | 11:04 AM