కొనుగోలుదారులకు షాక్.. పసిడి ధరలు మరింత ప్రియం
ABN , Publish Date - Mar 07 , 2026 | 10:32 AM
ఇటీవల వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం రేట్లు శనివారం మరోసారి ఎగబాకాయి. నేటి ఉదయం 10:00 గంటల సమయంలో మార్కెట్లో పసిడి, వెండిల ధరలను ఓసారి పరిశీలిస్తే...
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ బులియన్ మార్కెట్‌లో ఇటీవల వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు కొనుగోలుదారులకు భారీ షాక్‌నిచ్చాయి. ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలతో ధరల్లో మరోసారి ఈ పెరుగుదల నమోదైంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. శనివారం ఉదయం 10:00 గంటల సమయంలో బంగారం రేట్లు భారీగా ఎగబాకాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధరపై రూ.2,510 మేర ఎగబాకి రూ.1,63,640కు చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాములపై కూడా రూ.2,300 పెరిగి సరిగ్గా ఒకటిన్నర లక్షల వద్ద ట్రేడవుతోంది(Gold Rates Today).
ఇక వెండి విషయానికొస్తే.. క్రితం రోజుతో పోలిస్తే వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,85,000గా ఉంది(Silver Rates Today). అయితే.. అంతర్జాతీయ మార్కెట్లు, డాలర్ రేట్ల మార్పులు, పెట్టుబడిదారుల వ్యూహాల కారణంగానే పసిడి, వెండి ధరల్లో ఈ స్థాయిలో పెరుగుదల నమోదైందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రధాన నగరాల్లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం(10 గ్రాములకు) ధరలు ఇలా..
హైదరాబాద్: ₹1,63,640; ₹1,50,000
విజయవాడ: ₹1,63,640; ₹1,50,000
ఢిల్లీ: ₹1,63,800; ₹1,50,150
ముంబై: ₹1,63,640; ₹1,50,000
కోల్‌కతా: ₹1,63,640; ₹1,50,000
చెన్నై: ₹1,64,180; ₹1,50,500
బెంగళూరు: ₹1,63,640; ₹1,50,000
కేరళం: ₹1,63,640; ₹1,50,000
పుణే: ₹1,63,640; ₹1,50,000
వెండి రేట్లు(కిలోకు) ఇలా..
హైదరాబాద్: ₹2,89,900
విజయవాడ: ₹2,89,900
ఢిల్లీ: ₹2,85,000
ముంబై: ₹2,85,000
కోల్‌కతా: ₹2,85,000
చెన్నై: ₹2,90,000
బెంగళూరు: ₹2,85,000
కేరళం: ₹2,89,900
పుణే: ₹2,85,000
ఇవీ చదవండి:
వంటగ్యాస్ షాక్.. దేశంలో ఎల్పీజీ ధరలు భారీగా పెంపు