మేము ఎలాంటి అపచారం చేయలేదు: దువ్వాడ శ్రీనివాస్, మాధురి
ABN , Publish Date - Mar 07 , 2026 | 09:53 AM
తిరుమల ఆలయంలో కేక్ కటింగ్ వివాదంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి వివరణ ఇచ్చారు. తాము కట్ చేసింది ఎగ్ లెస్ కేక్ అని స్పష్టం చేశారు.
తిరుమల, మార్చి 7: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో దివ్వెల మాధురి, తనూజ కేక్ కటింగ్ చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆలయ నియమాలకు వ్యతిరేకంగా ఇలాంటి చర్యలు చేయడం సరికాదని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేక్ కటింగ్ వివాదంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వివరణ ఇచ్చారు. తిరుమలలో తాము కట్ చేసింది ఎగ్ లెస్ కేక్ మాత్రమేనని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి స్పష్టం చేశారు.
‘మేము కట్ చేసింది ఎగ్ లెస్ కేక్. ఆలయంలో కేక్ కట్ చేయకూడదనే నిబంధన మాకు తెలియదు’ అని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. అలాగే, ఈ వివాదంతో తనూజకు ఎటువంటి సంబంధం లేదని మాధురి తెలిపారు. ‘నేను తిరుమల శ్రీవారి పరమ భక్తుడిని. తిరుమలలో మేము ఎలాంటి అపచారం చేయలేదు. ఇది డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు. కేసులకు భయపడేది లేదు. లీగల్‌గా ఎదుర్కొంటాం’ అని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
దుర్గమ్మ ఆలయంలో 50 లక్షల బంగారం మిస్సింగ్
Read Latest AP News And Telugu News