Share News

వెంకన్నకు క్షమాపణ చెప్పరా?

ABN , Publish Date - Mar 07 , 2026 | 03:29 AM

తిరుమల లడ్డూ వ్యవహారంపై ఎన్‌డీడీబీ నివేదిక తర్వాత.. వెంకటేశ్వరస్వామికి అపచారం చేశారని, వెంటనే చర్యలు తీసుకోవాలని దేశంలో పూజారులు, హిందూ మతపెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వెంకన్నకు క్షమాపణ చెప్పరా?

  • ఏసు ప్రభువుకు అపచారం జరిగిందంటే చెప్పావే!

  • శ్రీవారికి అపచారం చేస్తే సమాధానమేదీ?

  • అన్నీ తెలిసే లడ్డూను కల్తీ చేశారు

  • తిరుమలపై ఇంకా కుట్ర కొనసాగుతోంది

  • ఎక్కడికి వెళ్లినా జగన్‌ వెంట బ్లేడ్‌బ్యాచ్‌

  • చావుకు, పెళ్లికీ రప్పా రప్పా ఒక్కటే మంత్రం

  • వైసీపీ హయాంలో పెను విధ్వంసం

  • మేం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెట్టాం

  • వచ్చే సమావేశాలకు ఎమ్మెల్యే క్వార్టర్స్‌ రెడీ

  • ఉగాదికి 3 లక్షల గృహప్రవేశాలు

  • అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు

వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. స్వామికి నైవేద్యం ఇచ్చే నెయ్యిని కల్తీ చేశారు. ఇది మామూలు నేరం కాదు. ఏదో తెలియకుండా జరిగిన పొరపాటు కాదు. కుట్రతోనే నేరానికి పాల్పడ్డారు. తిరుమల పవిత్రతను దెబ్బ తీసేందుకు వాళ్లు చేస్తున్న కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

- సీఎం చంద్రబాబు

అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ‘‘తిరుమల లడ్డూ వ్యవహారంపై ఎన్‌డీడీబీ నివేదిక తర్వాత.. వెంకటేశ్వరస్వామికి అపచారం చేశారని, వెంటనే చర్యలు తీసుకోవాలని దేశంలో పూజారులు, హిందూ మతపెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆ పార్టీ(వైసీపీ) ఇప్పటికీ జరిగిన తప్పును గుర్తించి వాస్తవికతలోకి రాలేదు. ఏసు ప్రభువుకు అపచారం జరిగితే.. క్షమించు ప్రభువా అని జగన్‌ వేడుకున్న వార్తను సాక్షి ప్రచురించింది. మరి.. వెంకటేశ్వరస్వామికి చేసిన అపచారంపై అదే జగన్‌ ఎందుకు క్షమాపణలు చెప్పరు?’’ అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి ముందు ఆయన పలు అంశాలపై మా ట్లాడారు. తిరుమల లడ్డూ అంశాన్ని ప్రస్తావిస్తూ.. వైసీపీ అధినేత జగన్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బ తీసేందుకు వా ళ్లు చేస్తున్న కుట్ర ఇంకా కొనసాగుతూనే ఉందని అన్నారు. ‘‘రాబోయే రోజుల్లో వెంకటేశ్వరస్వామి పవిత్రతను, ప్రభావాన్ని తగ్గించగలమని వారనుకుంటున్నారు. ఏపీలో దేవాలయాలకు వెళ్లే ప్రజల సంఖ్య 50-70శాతం మేర పెరిగింది. వారెన్ని కుట్రలు చేసినా శ్రీవారిని ఏమీ చేయలేరు. దేవుడిని అపవిత్రం చేసిన వారి గురించి ప్రజలే చూసుకుంటారు’’ అని అన్నారు. గతంలో రాజశేఖరరెడ్డి హయాంలో తిరుమలకు రెం డు కొండలే అని జీఓలు ఇస్తే తాను పోరాడానని, రెం డేళ్ల తర్వాత తన పోరాటానికి దిగొచ్చి వెంకటేశ్వరస్వామికి ఏడు కొండలు అని జీఓ ఇచ్చారని గుర్తుచేశారు.


రప్పా రప్పా.. ఏంటో..?

జగన్‌ పర్యటనలో రప్పా రప్పా అంటూ హడావుడి చేయడం ఏమిటని సీఎం ప్రశ్నించారు. ‘‘జగన్‌ ప్రొద్దుటూరుకు వెళ్తే రప్పా రప్పా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. పోయింది పెళ్లికి.. అక్కడ రప్పా రప్పా ఏమిటి? ఆయన పెళ్లికి వెళ్లినా, చావుకు పోయినా ఒక్కటే మంత్రం రప్పా రప్పా. ఇదేందో నాకు అర్థం కావడం లేదు. ఆయనకు సెక్యూరిటీ ఇవ్వలేదంటున్నారు. డ్యూటీకి వెళ్లిన ఎస్‌ఐ, ఏఎ్‌సఐలు స్ట్రెచర్‌పై వచ్చారు. దీన్నిబట్టి అక్కడ ఏం జరిగిందో ఊహించండి. జగన్‌ డ్రగ్స్‌, గంజాయిల గురించి మాట్లాడరు. గంజాయి, బ్లేడ్‌బ్యాచ్‌లను వెంటేసుకొని తిరుగుతారు. పొట్టేలు రక్తంతో కటౌట్‌లకు రక్తాభిషేకం చేయడం నా జీవితంలో చూడలేదు. కానీ జగన్‌ పర్యటనల్లో ఇదే జరుగుతోంది. పోస్టుమార్టానికి కారకులు అయిన వారు పోస్టుమార్టానికే పోతారన్నది నా ప్రగాఢ విశ్వాసం. జగన్‌ ఎక్కడికి వెళ్లినా విధ్వంస యాత్రలు చేస్తూ, టైర్ల కింద మనుషులను తొక్కేసి, ఆ నిందను ప్రభుత్వంపై వేస్తున్నారు. ఎక్కడివో పంటలు తీసుకొచ్చి రోడ్లపై వేసి ధర లేదని తొక్కించడం.. చావు లు, పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు బలప్రదర్శనలు చేస్తున్నారు. అంబులెన్స్‌లకూ దారివ్వడం లేదు’’ అని అన్నారు.


పెట్టుబడులు రాకుండా బెదిరింపులు

‘‘వైసీపీ అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌ కోలుకోలేని విధంగా విధ్వంసానికి గురైంది. ఇప్పుడు ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉండి కూడా పెట్టుబడులు రాకుండా అడ్డుపడుతోంది. ఏపీలో పెట్టుబడులు పెడితే .. మళ్లీ మేం వస్తాం, కేసులు పెడతాం అంటూ పీపీపీ ప్రాజెక్టుల్లోకి రానివ్వకుండా చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెను విధ్వంసం జరిగింది. మేం అధికారంలోకి వచ్చాక కూటమి పక్షాల సమన్వయంతో 20 నెలల్లో కష్టాలు, సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాం. గత ప్రభుత్వంలో తహశీల్దార్‌ ఆఫీసు, ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం, సర్క్యూట్‌ హౌజ్‌ వంటి ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలు తీసుకొచ్చారు. మేం వచ్చాక రూ.43,298 కోట్ల అప్పులను రీ షెడ్యూల్‌ చేయించడంతో రూ.328 కోట్లు ఆదా అ య్యాయి. మరో లక్ష కోట్ల అప్పులు కూడా రీ షెడ్యూల్‌ చేయించేలా చర్యలు తీసుకుంటున్నాం. దీనివల్ల రూ.1,658 కోట్ల వెసులుబాటొస్తుంది’’ అని చెప్పారు.

పోలవరం, అమరావతి చకచకా

‘‘పోలవరం ప్రాజెక్టును వచ్చే గోదావరి పుష్కరాల నాటికి సిద్ధం చేస్తాం. వచ్చే జూన్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. వచ్చే మూడేళ్లలో అమరావతి రాజధానికి ఓ రూపు వస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి ఎమ్మెల్యేలు, మంత్రుల నివాస సముదాయాలు సిద్ధం అవుతాయి. త్వరలో ఫ్యామిలీ కార్డు విధానం తీసుకొస్తాం. ప్రభుత్వాలు అందించే పథకాలన్నింటితో ఈ ఫ్యామిలీ కార్డును అనుసంధానిస్తాం’’ అని అన్నారు.

‘‘రాష్ట్రంలో 25 పాలసీలను తీసుకురావడం ద్వారా 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. వీటివల్ల 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల ఇప్పటికే 6.68 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చా యి. ఇందులో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రజలపై కొత్తగా ఎలాంటి విద్యుత్‌ చార్జీల భారం వేయం. వైసీపీ ప్రభుత్వం ట్రూఅప్‌ పేరిట వేసిన భా రాన్ని క్రమక్రమంగా తగ్గిస్తున్నాం’’ అని తెలిపారు.


పారిశ్రామికవేత్తలుగా మహిళలు

‘‘ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా, ఎంఎ్‌సఎమ్‌ఈ నిర్వాహకులుగా తీర్చిదిద్దాం. ఈ మహిళా దినోత్సవం నాటికి ఈ టార్గెట్‌ను సాధించాం. వచ్చే మహిళా దినోత్సవం నాటికి ఐదు లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం. ఉగాదికి మూడు లక్షల గృహప్రవేశాలు చేయిస్తాం. నక్సలిజం కనుమరుగవుతోంది. కుటుంబాలను నాశనం చేసే ఫ్యాక్షనిజం కూడా పూర్తిగా నిర్మూలన చేయాల్సిన అవసరం ఉంది’’ అని చంద్రబాబు అన్నారు.

ఎమ్మెల్యేలు జవాబుదారీగా ఉండాలి

ఎన్టీయే పక్ష ఎమ్మెల్యేలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు. నిబద్ధత, కఠోర శ్రమతో ప్రజల కోసం పనిచేయాలని కోరారు. తమ చర్యలతో ఎన్డీయే కూటమికి, పార్టీలకు, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని సూటిగా, స్పష్టంగా చెప్పారు. ఇటీవలి కాలంలో కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం రచ్చకెక్కిన నేపథ్యంలో చంద్రబాబు ఈ అంశంపై ఎమ్మెల్యేలకు సూచనలు చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసుకోవద్దని పలుమార్లు సూచించారు. కూటమిగా తమకు ఒక అజెండా ఉందని, 2029లోనూ గెలిచి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించాల్సి ఉందని సీఎం చెప్పారు. 15 ఏళ్లపాటు కూటమి కొనసాగితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు.


రూ.308లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ మన లక్ష్యం

మోదీ సంకల్పానికి అనుగుణంగా పనిచేద్దాం

ఆత్మనిర్భర్‌, వికసిత్‌ భారత్‌పై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సంకల్పం

డిప్యూటీ సీఎం పవన్‌, సత్యకుమార్‌ మద్దతు

2047 నాటికి భారత్‌ అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని, అందులో మన భాగస్వామ్యం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఆత్మనిర్భర్‌, వికసిత్‌ భారత్‌పై ఆయన శుక్రవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా కూటమి పార్టీ నేతలు సీఎం చేసిన తీర్మానాలకు సంఘీభావం తెలుపుతూ సభలో ప్రసంగించారు. సీఎం మాట్లాడుతూ, ఆత్మనిర్భర్‌, వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యాలకు అనుగుణం గా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడ మే ఎన్డీయే ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఇంటింటా స్వదేశీ సిద్ధాంతాలకు ప్రాధాన్యమిస్తూ స్థానిక ఉత్పత్తులనే వినియోగించాలని పిలుపునిచ్చారు. తీర్మానంలోని ముఖ్య అంశాలు... ప్రధాని మోదీ ప్రతిపాదించిన ఆత్మనిర్భర్‌, వికసిత్‌ భారత్‌ సంకల్పానికి అనుగుణంగా, రాష్ట్రాన్ని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో మరింత బలోపేతం చేయాలి. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టి, రాష్ట్రాన్ని రూ.308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మా ర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఏటా 15ు స్థిరమైన వృద్ధిరేటు నమోదు చేయాలనే లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. తొలిదశ వోకల్‌ ఫర్‌ లోకల్‌, రెండో దశ లోకల్‌ టు గ్లోబల్‌. ప్రతి ఇంటా స్వదేశీ-ఇంటింటా స్వదేశీ సిద్ధాంతాలకు ప్రాధాన్యమిస్తూ స్థానిక ఉత్పత్తులనే వినియోగించాలి.

Updated Date - Mar 07 , 2026 | 03:47 AM