Share News

బీఆర్ఎస్ నిర్మించిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా!.. ఎమ్మెల్యే నాయిని

ABN , Publish Date - Nov 23 , 2026 | 12:00 PM

కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించింది బీఆర్ఎస్ అనేది వాస్తవమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సవాల్ విసిరారు.

బీఆర్ఎస్ నిర్మించిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా!.. ఎమ్మెల్యే నాయిని
nayini challenges ktr

హన్మకొండ, నవంబరు 23: కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించింది బీఆర్ఎస్ అనేది వాస్తవమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సవాల్ విసిరారు. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా హన్మకొండలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే బీఆర్ఎస్‌పై మండిపడ్డారు. ఎమ్మెల్యే నాయినితో పాటు.. ఎంపీ కడియం కావ్య, నాగరాజు ఈ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.


కాళోజీ కళాక్షేత్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు కౌంటర్ ఇచ్చారు. హన్మకొండలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి.. ‘కేసీఆర్ వంద అబద్ధాలు’ అంటూ స్క్రీన్ ఏర్పాటు చేసి వివరించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్‌పై ధ్వజమెత్తారు.


‘కాళోజీ కళాక్షేత్రం తాము నిర్మించామని కేటీఆర్ అంటున్నారు. వారు పదికోట్లు ఇచ్చి మధ్యలో నిర్మాణం వదిలేస్తే.. ఎనభై కోట్ల రూపాయలు మంజూరు చేసి మేము పూర్తి చేశాము. ఇది అబద్ధమైతే నేను రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా. వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం మధ్యలోనే వదిలేశారు. ఎయిర్ పోర్ట్ ఎంత విస్తీర్ణంలో ఉందో కేటీఆర్‌కు తెలుసా..? 550 కోట్ల రూపాయలతో వరంగల్ నగరాన్ని మేము అభివృద్ధి చేశాం. యూడీజీకి 5వేల కోట్ల రూపాయలు మంజూరు చేశాం. వరంగల్ అభివృద్ధిపై చర్చకు కేటీఆర్ సిద్ధమా..? కేటీఆర్‌కు దమ్ముంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలవాలి’ అంటూ నాయిని సవాల్ విసిరారు.


ఇవి కూడా చదవండి..

మార్కెట్ల పతనం, ఇరాన్ దాడులకు డెమోక్రాట్ల విజయమే కారణం: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

సత్యసాయి బాబా సేవలు చిరస్మరణీయం.. సీఎం చంద్రబాబు నివాళి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 12:00 PM