Share News

కోతులతో పరేషాన్.. ఇళ్లలోకి చొరబడుతూ ఇబ్బందులు

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:44 PM

వరంగల్‌ జిల్లా కేంద్రంలో వానరాలు రోజురోజుకు వీరంగం సృష్టిస్తున్నాయి. కోతులు గుంపులుగా వెళుతూ కాలనీలపై విరుచుకుపడుతున్నాయి.

కోతులతో పరేషాన్.. ఇళ్లలోకి చొరబడుతూ ఇబ్బందులు
monkeys in Warangal

  • భయాందోళనలో ప్రజలు

వరంగల్‌ టౌన్‌: వరంగల్‌ జిల్లా కేంద్రంలో వానరాలు రోజురోజుకు వీరంగం సృష్టిస్తున్నాయి. కోతులు గుంపులుగా వెళుతూ కాలనీలపై విరుచుకుపడుతున్నాయి. ఇళ్లు, దుకాణాలలో తినుబండారాలు, వస్తువులను ఎత్తుకెళ్లడంతో పాటు పండ్ల చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. ప్రజలపై దాడులకు దిగుతూ గాయపరుస్తున్నాయి. కోతుల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోతుల నియంత్రణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు.


కోతులు గుంపులు గుంపులుగా కాలనీలలో సంచరిస్తూ వీరంగం సృష్టిస్తున్నాయి. అటవీ ప్రాంతాలు రోజురోజుకు తగ్గిపోవడం వాటికి అడవిలో ఆహారం లభించకపోవడంతో గ్రామాల్లోకి, కాలనీల్లోకి చొచ్చకువస్తున్నాయి. ఇళ్లలో తయారు చేసుకున్న భోజనాలతో పాటు పప్పు దినుసులు పట్టుకెళ్తున్నాయి. కిరాణాషా పులు, పండ్ల దుకాణాలదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాపు ల్లోని వస్తువులకు రక్షణగా జాలీలను ఏర్పాటుచేసుకుంటున్నారు.


hnk2.2.jpgఇళ్లలో చొరబడి వీరంగం సృష్టిస్తున్న కోతులను తరిమే ప్రయత్నంలో అవి ప్రజలపై దాడులకు దిగుతున్నాయి. కోతి కాటుకు గురై ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇళ్లపై గుంపులుగుంపులుగా ఒక చోట చేరి వచ్చిపోయే వారిపై ఎగబడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కోతుల బెడద తీవ్రం కావడంతో కొంత మంది టపాసులు, పెద్ద శబ్దాలు చేసి కోతులను తరిమే ప్రయత్నం చేస్తున్నారు. కోతుల నియంత్రణ కోసం అధికారులు చర్యలు చేపట్టి వాటిని అటవీ ప్రాంతాలకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు.


అధికారులు చర్యలు తీసుకోవాలి

కోతులు ఇళ్లలోకి గుంపుగుంపులుగా వచ్చి ఆహరపదార్థాలు ఎత్తుకెళ్తు న్నాయి. వాటిని తరిమేక్రమంలో దాడులు చేస్తున్నాయి. కోతుల బెడద రోజురోజుకు ఎక్కువవుతోంది. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కోతుల బెడద నుంచి ప్రజలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలి.

  • ఎన్‌.పవన్‌కుమార్‌, స్థానికుడు, కొత్తవాడ


ఈ వార్తలు కూడా చదవండి:

వరంగల్‌ మార్కెట్లో మక్కలకు రికార్డు ధర

మెట్రో టేకోవర్‌ కోసం రుణాల వేట

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 12:44 PM