Share News

ఫైళ్లను త్వరగా క్లియర్ చేయండి: సీఎం చంద్రబాబు సీరియస్

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:11 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో అధికారుల పనితీరుపై సీరియస్ అయ్యారు. జిల్లాల్లో ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలు, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను సమీక్షించారు.

ఫైళ్లను త్వరగా క్లియర్ చేయండి: సీఎం చంద్రబాబు సీరియస్
AP CM Chandrababu Naidu

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో అధికారుల పనితీరుపై సీరియస్ అయ్యారు. జిల్లాల్లో ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలు, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను సమీక్షించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు (AP CM Chandrababu Naidu).


ఫైల్స్ క్లియర్ చేయడానికి మంత్రులు, సెక్రటరీలు, హెచ్‌వోడీలు, జిల్లా కలెక్టర్ లు ఎన్ని రోజులు తీసుకుంటున్నారో కూడా సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎక్కువ సమయం తీసుకుంటున్న వారిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది సెక్రటరీలు రెండ్రోజుల్లో ఫైళ్లను క్లియర్ చేస్తున్నారని, కొందరు హెచ్‌వోడీలు మాత్రం మూడ్రోజులు తీసుకుంటున్నారని అన్నారు (AP Collectors Conference).


చెరకు విషయంలో వెంకట్రావు అనే అధికారి 35 రోజులు సమయం తీసుకున్నారని, మరికొందరు కూడా వారాల తరబడి సమయం తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు (AP News). ఫైళ్లను క్లియర్ చేయడానికి అన్ని రోజుల సమయం ఎందుకు పడుతోందో వివరణ తీసుకోవాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. అలాగే కొందరు మంత్రులు కూడా తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సీఎం సూచించారు.


ఇవి కూడా చదవండి..

బ్రిక్స్‌ సదస్సు కోసం ఢిల్లీకి పుతిన్.. నేడు ప్రధాని మోదీతో కీలక భేటీ..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 11 , 2026 | 12:20 PM