Share News

మేడిగడ్డను సందర్శించిన మహారాష్ట్ర సీఎస్‌

ABN , Publish Date - Nov 02 , 2026 | 06:39 AM

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీని మహారాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ రాజేష్‌ అగర్వాల్‌ సందర్శించారు.

మేడిగడ్డను సందర్శించిన మహారాష్ట్ర సీఎస్‌
Rajesh Agarwal

మహదేవపూర్‌ రూరల్‌, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీని మహారాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ రాజేష్‌ అగర్వాల్‌ సందర్శించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచా మండలంలోని పలు ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. పల్లె నిద్ర అనంతరం ఆయన ఆదివారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీతో పాటు మహారాష్ట్ర వైపు ఉన్న వడిదం పార్క్‌, తదితర సందర్శనీయ ప్రదేశాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. బ్యారేజీకి వచ్చిన సీఎ్‌సకు మేడిగడ్డ ఈఈ సురేష్‌ ప్రాజెక్టు గురించి వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అవగాహనతోనే సైబర్‌ నేరాలకు చెక్‌

పండగ ముందు.. మిఠాయి చేదు!

చుక్కను పట్టి.. పచ్చని వనమై!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 06:39 AM