మంత్రి కొండా సురేఖ ఫిర్యాదుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందన
ABN , Publish Date - Jul 08 , 2026 | 03:30 PM
మంత్రి కొండా సురేఖ ఫిర్యాదుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదని.. వివరణ ఎందుకు ఇస్తానని అన్నారు.
జనగామ, జులై 8: జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఏఐసీసీకి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. ‘నేను ఏ తప్పూ చేయలేదు.. వివరణ ఎందుకు ఇస్తా’ అని అన్నారు. ప్రోటోకాల్‌కు లోబడే పనిచేస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని పలు ఆలయాల సమస్యలపై సంబంధిత శాఖ అధికారులు, ఆలయ చైర్మన్లను కలిశానని చెప్పారు. అధికారులతో ఎలాంటి సమీక్ష నిర్వహించలేదని, సమస్యలు మాత్రమే విన్నవించినట్లు వివరించారు.
దేవదాయ శాఖలో నిధులు లేవంటే... నియోజకవర్గంలోని ఆలయాల సమస్యల పరిష్కారానికి ఎస్టిమేషన్‌లను మాత్రమే కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆ శాఖపై సమీక్ష నిర్వహించే హక్కు తనకు లేదని తెలుసన్నారు. ఇదంతా అవగాహన లోపంతోనే జరుగుతోందన్నారు. కొందరు కొత్త అలవాట్లు నేర్చుకున్నారని.. కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం.. మంత్రులను అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా కలుస్తానని చెప్పారు. ఆలయాల సమస్యల పరిష్కారం కోసం మాత్రమే కమిషనర్‌ను కలిసినట్లు కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
సూర్యాపేటలో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. పోలీసుల లాఠీఛార్జి
ఆ ఒప్పందం బయటపెడితే రాజీనామాకు సిద్ధం.. సీఎం రేవంత్‌కు హరీశ్ సవాల్
Read Latest Telangana News And Telugu News