హిందుత్వ మూలాలను దెబ్బతీసేలా జగన్ వ్యాఖ్యలు: మంత్రి సత్యకుమార్ యాదవ్
ABN , Publish Date - Jul 08 , 2026 | 03:11 PM
సానుకూల వాతావరణం ఉన్నప్పుడు లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. కులమత విద్వేషాలు పెంచేలా చేస్తున్నారని మండిపడ్డారు.
విజయవాడ, జులై 8: సానుకూల వాతావరణం ఉన్నప్పుడు లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. కులమత విద్వేషాలు పెంచేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. చట్ట పరిధిలో మత విద్వేషాలు రేకెత్తిస్తున్న వారిపై చర్యలు తప్పవన్నారు. పక్క రాష్ట్రాల నుంచి వీడియో మెసేజ్‌లు పంపుతూ విద్వేషాలు రేకిస్తున్నారని ఆరోపించారు. హిందుత్వ మూలాలు దెబ్బతీసేలా కుట్రపూరితంగా జగన్ మాట్లాడారంటూ విరుచుకుపడ్డారు. విద్వేషాలకు ఊతమిచ్చేలా నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలున్నాయన్నారు.
జగన్ హయాంలో మూడు ప్రాంతాలనూ అభివృద్ధి చేయలేదని మంత్రి విమర్శించారు. మావిగన్ అనే అసంబద్ధమైన వాదన తీసుకొచ్చారన్నారు. పొంతన లేకుండా మాట్లాడుతున్న మాటలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల కోసం ప్రత్యేక ఆలోచనలు జరుగుతున్నాయని.. స్థానిక ఎన్నికల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధిపై ముందుకెళతామని చెప్పారు. త్వరలోనే స్థానిక ఎన్నికల్లో ఎవరు.. ఎక్కడ పోటీ చేయాలనే దానిపై పార్టీ అధినాయకత్వాలు నిర్ణయిస్తాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
యూట్యూబర్ రావణ్ ఫోన్‌లో విస్తుగొలిపే విషయాలు..
Read Latest AP News And Telugu News