యూట్యూబర్ రావణ్ ఫోన్‌లో విస్తుగొలిపే విషయాలు..
ABN , Publish Date - Jul 08 , 2026 | 01:51 PM
యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ కేసు దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 2న కాకినాడ జిల్లా సర్పవరంలో రావణ్‌ను అరెస్ట్ చేసిన సమయంలో అతని మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాకినాడ, జులై 8: యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ కేసు దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల(జులై) 2న కాకినాడ జిల్లా సర్పవరంలో రావణ్‌ను అరెస్ట్ చేసిన సమయంలో అతని మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్‌ను పరిశీలించగా.. రావణ్ పదుల సంఖ్యలో మహిళలతో సన్నిహితంగా ఉన్నట్లు కనిపించే వీడియోలను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని తన స్టూడియోలో రహస్య కెమెరాల ద్వారా ఈ వీడియోలు చిత్రీకరించినట్లు విచారణలో బయటపడింది.
ఈ వీడియోల ద్వారా అనేక మంది మహిళలను రావణ్ బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. ప్రతి నెలా బ్లాక్‌మెయిల్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో బాధితులైన మహిళలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని.. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఎన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికే అమరావతి పూర్తి: మంత్రి నారాయణ
గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
Read Latest AP News And Telugu News