గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:43 PM
విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది.
విశాఖపట్నం, జులై 8: విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది. ఈరోజు(బుధవారం) మృతుల కుటుంబాలకు మంత్రి కొల్లు రవీంద్ర చెక్కులను అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఐదు లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఐదు లక్షలను అందజేశారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి తెలిపారు.
దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వం తక్షణ సహాయం కింద రూ.10 లక్షలు మత్స్యకారుల కుటుంబాలకు అందించినట్లు మంత్రి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కూడా మత్స్యకారులకు ఇవ్వాల్సిన 63 క్లెయిమ్స్ పెండింగ్‌లో పెట్టారన్నారు. రూ.3.15 కోట్లను కూడా ఈరోజు క్లియర్ చేశామన్నారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. గల్లంతైన మత్స్యకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్‌లతో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని మంత్రి కొల్లురవీంద్ర పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కొరియా కంపెనీలకు లోకేశ్ ఆహ్వానం.. బుసాన్‌లో APEX-Korea ప్రారంభం
ఎన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికే అమరావతి పూర్తి: మంత్రి నారాయణ
Read Latest AP News And Telugu News