Share News

పశువుల కొట్టంలో దూరిన కొండచిలువ.. ధైర్యంగా పట్టుకున్న రైతు

ABN , Publish Date - Nov 21 , 2026 | 09:27 PM

ప్రకృతితో మమేకమవుతూ భూమి తల్లిని నమ్ముకున్న ఓ రైతును కొండచిలువ బయపెట్టలేకపోయింది. తన పశువుల కొట్టాంలోకి దూరిన కొండచిలువను ధైర్యంగా పట్టుకున్న రైతు ఫారెస్ట్ ఆఫీసర్‌కు సమాచారం అందించారు.

పశువుల కొట్టంలో దూరిన కొండచిలువ.. ధైర్యంగా పట్టుకున్న రైతు
farmer python rescue

వికారాబాద్, నవంబరు 21: ఓ రైతు పశువుల కొట్టాంలోకి పెద్ద కొండచిలువ దూరింది. గమనించిన ఆ రైతు పామును చంపకుండా.. ధైర్యంగా దాన్ని పట్టుకుని.. బోనుల బంధించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని దోమ మండలం మైలారం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..


వికారాబాద్ జిల్లాలో గల దోమ మండలంలోని మైలారం గ్రామంలో నివసిస్తున్న నర్సింలు అనే రైతు పశువుల కొట్టాంలోకి కొండచిలువ దూరింది. గమనించిన నర్సింలు.. పాముని కొట్టి చంపలేదు. ధైర్యంగా దాన్ని పట్టుకుని బోన్‌లో బంధించారు. అనంతరం తన దగ్గర ఉన్న కొండచిలువను తీసుకెళ్లాల్సిందిగా ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు.

దీంతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు హీర్యా నాయక్.. ఘటనా స్థలానికి చేరుకుని కొండచిలువను స్వాధీనం చేసుకున్నారు. పాము కనబడగానే చంపకుండా.. పట్టుకున్న రైతు ధైర్యాన్ని, ఫారెస్ట్ అధికారులకు అందజేయాలన్న ఆయన ఆలోచనను మెచ్చుకున్నారు. అనంతరం స్వాధీనం చేసుకున్న కొండచిలువను సమీప రిజర్వ్ ఫారెస్ట్‌లో వదిలివేశారు. ఈ క్రమంలో వన్యప్రాణులను చంపకుండా, గాయపరచకుండా తమకు సమాచారం అందించాలని ఫారెస్ట్ అధికారి.. రైతులను కోరారు. కాగా.. రైతు ధైర్యాన్ని తోటి గ్రామస్థులు మెచ్చుకున్నారు.


ఇవి కూడా చదవండి..

ప్రకాశం జిల్లాలో రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి

ఎన్టీఆర్ జిల్లాలో పెద్దపులి కలకలం.. తిరువూరు అడవుల్లోకి చేరిన ‘ఎక్స్‌ప్లోరర్’

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 09:46 PM