Share News

11 రోజుల విదేశీ పర్యటనకు సీఎం రేవంత్‌

ABN , Publish Date - Aug 18 , 2026 | 08:21 AM

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 11 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు.

11 రోజుల విదేశీ పర్యటనకు సీఎం రేవంత్‌
CM Revanth Reddy

  • రేపు ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరై.. అటు నుంచి బ్రిటన్‌కు పయనం

  • అక్కడి నుంచి అమెరికాకు..

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 11 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి హాజరవ్వనున్న ఆయన.. అనంతరం అదే రోజు సాయంత్రం బ్రిటన్‌ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి అమెరికాకు పయనమవుతారు.


యూకే, యూఎ్‌సలో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమై.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పలువురు ఉన్నతాధికారులు కూడా సీఎంతో పాటు వెళ్తున్నారు. 11 రోజుల పర్యటన అనంతరం ఈనెల 30న వారు హైదరాబాద్‌కు చేరుకుంటారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

కూరగాయలు కాదు.. కాలకూట విషం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 08:21 AM