అర్హులైన పేదవారికి చేయూత పెన్షన్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం
ABN , Publish Date - Nov 16 , 2026 | 07:10 PM
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4.64 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేశామని.. పెన్షన్ల ద్వారా పేదవారికి చేయూత అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
సిద్ధిపేట, నవంబర్ 16: రాష్ట్రవ్యాప్తంగా 4.64 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేశామని.. పెన్షన్ల ద్వారా పేదవారికి చేయూత అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జిల్లాలోని అక్కన్నపేట మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి చేయూత పెన్షన్‌దారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
సిద్ధిపేట జిల్లాలోని అక్కన్నపేట మండలం కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. పెన్షన్‌దారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు. అర్హులైన ప్రతి పేదవారికి చేయూత పెన్షన్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 7 రకాల పెన్షన్ల కింద 4.64 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేశామని.. ఇంకా పెన్షన్ అందని అర్హులు ఎవరైనా ఉంటే, వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రతీ ఒక్కరికి పెన్షన్‌లు అందిస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. మహిళా సంఘాలకు ఇప్పటివరకు 79 వేల కోట్ల రూపాయల రుణాలను వడ్డీ లేకుండా అందించామన్నారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే!
అమిత్ షా పర్యటన.. విజయవాడలో ‘నో ఫ్లైయింగ్ జోన్’ అమలు
Read Latest AP News And Telugu News