Share News

శ్రీశైలంలో కార్తీక శోభ!

ABN , Publish Date - Nov 17 , 2026 | 05:01 AM

కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో లక్ష దీపోత్సవం, పుష్కరిణికి హారతి వేడుకలు వైభవంగా నిర్వహించారు.

శ్రీశైలంలో కార్తీక శోభ!
Srisailam Temple

  • ఘనంగా లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి

శ్రీశైలం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో లక్ష దీపోత్సవం, పుష్కరిణికి హారతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేలాదిగా భక్తులు క్షేత్రానికి చేరుకుని కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.


సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్దకు తోడ్కొని వచ్చి ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన వేదికపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పుష్కరిణికి దశవిధ హారతులను ఇచ్చారు. అదే విధంగా పుష్కరిణికి నాలుగువైపులా లక్షదీపోత్సవాన్ని నిర్వహించి శివసేవకులు భక్తులు దీపాలు వెలిగించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 05:01 AM