సీఎం రేవంత్‌కు కేరళ ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డ్..
ABN , Publish Date - Sep 25 , 2026 | 08:30 PM
కేరళ ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డును తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రదానం చేశారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ అవార్డును సీఎంకు అందజేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 25: కేరళ ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డును తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రదానం చేసింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ అవార్డును సీఎంకు అందజేశారు.
ఆర్యదాన్ మహమ్మద్ పురస్కారం-2026 ఏడాదికి గానూ కేరళ ఆర్యదాన్ మహమ్మద్ ఫౌండేషన్ ఈ అవార్డును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రకటించింది. రైతులు, బీసీలు, సామాన్య పౌరుల సంక్షేమ పాలనకు గుర్తింపుగా రేవంత్‌కు ఈ అవార్డును ప్రకటించినట్లు జ్యూరీ తెలిపింది. కేరళలోని నిలంబూరులో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. కేరళ ఎంపీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా తెలంగాణ సీఎం రేవంత్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా.. ప్రజాస్వామిక విలువలపై రేవంత్ రెడ్డి నిబద్ధతను జ్యూరీ ప్రశంసించింది.
కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆర్యదాన్ మహమ్మద్ స్మారకంగా ఈ అవార్డును ఆర్యదాన్ ఫౌండేషన్ ప్రకటిస్తుంది. సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసేవారిని, ప్రజా సేవకులను, ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధత కలిగిన నాయకులను ఈ ఫౌండేషన్ ప్రతీ ఏడాది ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ పురస్కారంతో సత్కరిస్తుంది. ఆర్యదాన్ మహమ్మద్ నాలుగో వర్థంతి సందర్భంగా 2026 ఏడాదికి గానూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉత్తమ ప్రజాసేవకుడిగా ఎంపిక చేసింది.
ఇవి కూడా చదవండి..
వైసీపీకి యనమల కృష్ణుడు రాజీనామా.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపయ్య
Read Latest AP News And Telugu News