తెలంగాణ రైతు దేశానికే అన్నదాత
ABN , Publish Date - Nov 08 , 2026 | 03:13 AM
తెలంగాణ రైతాంగాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
2.53 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానం: తుమ్మల
వికారాబాద్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ రైతాంగాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత రెండున్నరేళ్లలో తెలంగాణ రైతులు దేశంలోనే అత్యధికంగా పంటలు పండించి దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగారని కొనియాడారు. 2.53 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని, ఇది రాష్ట్ర రైతాంగం సాధించిన ఘనత పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం హకీంపేట్‌లో నిర్వహించిన రైతు మేళా సదస్సులో ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వం పదేళ్లలో రూ.75 వేల కోట్లు రైతు ఖాతాల్లో జమచేస్తే, రెండున్నరేళ్లలోనే రూ.35 వేల కోట్లు రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతోందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పథకాల నుంచి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల వరకు, మధ్యలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి పథకాలను సైతం కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News