రైతు సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Nov 08 , 2026 | 03:17 AM
రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
కొడంగల్‌లో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక: శ్రీధర్‌బాబు
వికారాబాద్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రైతులకు ఏ దశలోనూ అన్యాయం జరగకుండా సీఎం నేతృత్వంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ టెక్నాలజీ వినియోగంతో సాగును మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కొడంగల్‌లో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News