Share News

రంగారెడ్డి జిల్లాలో జింక మాంసం పట్టివేత.. 8 మంది అరెస్ట్

ABN , Publish Date - Sep 28 , 2026 | 10:28 AM

రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ టోల్‌ప్లాజా వద్ద జింక మాంసం పట్టుబడింది. జింక మాంసాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో టోల్‌ప్లాజా వద్ద ఎస్‌ఓటీ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.

రంగారెడ్డి జిల్లాలో జింక మాంసం పట్టివేత.. 8 మంది అరెస్ట్
Ranga Reddy

రంగారెడ్డి, సెప్టెంబర్ 28: జిల్లాలోని షాద్‌నగర్ టోల్‌ప్లాజా వద్ద జింక మాంసం పట్టుబడింది. జింక మాంసాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో టోల్‌ప్లాజా వద్ద ఎస్‌ఓటీ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా జింక మాంసాన్ని తరలిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 13 కిలోల జింక మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వేటకు ఉపయోగించిన ఓ రిఫైల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.


ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. జింక మాంసాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అదుపులోకి తీసుకున్న ఎనిమిది మందిని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

ఎంకే 18 మాడ్ 2 కింగ్‌ఫిష్‌ను సీజ్ చేశాం: ఐఆర్జీసీ

ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 10:37 AM