Share News

ఎంకే 18 మాడ్ 2 కింగ్‌ఫిష్‌ను సీజ్ చేశాం: ఐఆర్జీసీ

ABN , Publish Date - Sep 28 , 2026 | 09:34 AM

హోర్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన మరో అండర్‌వాటర్ డ్రోన్‌ను సీజ్ చేశామని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ) పునరుద్ఘాటించింది. దానిని ఎంకే మాడ్ 2 కింగ్‌ఫిష్‌గా గుర్తించామని ఐఆర్జీసీ ప్రతినిధి, సెకండ్ బ్రిగేడియర్ జనరల్ హుస్సేన్ మెహెబి ఎక్స్‌లో తెలిపారు.

ఎంకే 18 మాడ్ 2 కింగ్‌ఫిష్‌ను సీజ్ చేశాం: ఐఆర్జీసీ
irgc claim on American drone

ఇంటర్‌నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన మరో అండర్‌వాటర్ డ్రోన్‌ను సీజ్ చేశామని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ) పునరుద్ఘాటించింది. దానిని ఎంకే మాడ్ 2 కింగ్‌ఫిష్‌గా గుర్తించామని ఐఆర్జీసీ ప్రతినిధి, సెకండ్ బ్రిగేడియర్ జనరల్ హుస్సేన్ మెహెబి ఎక్స్‌లో తెలిపారు. ఇప్పుడు హోర్ముజ్ జలసంధి ఓపెన్‌గా మాత్రమే లేదని, అమెరికా జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకున్న తమ నేవీకి వేటాడే క్షేత్రంగానూ ఉందని ఆయన చెప్పారు. తమ నేవీ క్యాప్చర్ చేసిన ఆ అండర్‌వాటర్ డ్రోన్‌ను అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేశారని అన్నారు. సోనార్, ప్రెసిషన్ నేవిగేషన్ సిస్టమ్ ఆ డ్రోన్‌లో ఉందని, దాని విలువ కొన్ని మిలియన్ డాలర్లని తెలిపారు. కాగా.. అంతకుముందు హోర్ముజ్‌లో అమెరికా మిలిటరీకి చెందిన రెముస్ 600ను సీజ్ చేశామని ఐఆర్జీసీ ప్రకటించింది. అయితే, అది రెముస్ 600 కాదని, ఎంకే మాడ్ 2 కింగ్‌ఫిష్ అని వెల్లడించింది.


అమెరికన్ టెర్రరిస్ట్ ఆర్మీ జలాంతర్గామిని లక్ష్యంగా చేసుకున్నాం

అమెరికన్ టెర్రరిస్ట్ ఆర్మీకి చెందిన జలాంతర్గాములను హోర్ముజ్ జలసంధిలో లక్ష్యంగా చేసుకున్నామని ఐఆర్జీసీ ప్రకటించింది. ఇరానియన్ మిలిటరీ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ పర్యవేక్షణతో, ఎంతో సమన్వయంతో కూడిన క్లిష్టమైన ఆపరేషన్ ద్వారా అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నామని ఐఆర్జీసీ తెలిపింది. దానిని నిపుణులైన మిలిటరీ టెక్నీషియన్లకు అప్పగించామని, వారు ఆ డ్రోన్‌ను పరీక్షించి అందులో ఉన్న డేటాను రికవరీ చేస్తారని ఐఆర్జీసీ వెల్లడించింది. కాగా.. ఐఆర్జీసీ చేసిన వ్యాఖ్యలను అమెరికా మిలిటరీ కొట్టివేసింది. తమ అండర్‌వాటర్ డ్రోన్‌ను పట్టుకున్నట్లు ఐఆర్జీసీ ప్రకటించిందని, అయితే అందులో ఎలాంటి నిజం లేదని యూఎస్ మిలిటరీ పేర్కొంది.


ఇవి కూడా చదవండి...

తుది పోరుకు సిద్ధం: ఇరాన్ అధ్యక్షుడు

నేపాల్‌లో బేస్ క్యాంప్ మీద కుప్పకూలిన అవలాంచ్.. ఇద్దరి మృతి

Read Latest International News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 09:34 AM