నేపాల్‌లో బేస్ క్యాంప్ మీద కుప్పకూలిన అవలాంచ్.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Sep 28 , 2026 | 08:26 AM
నేపాల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. మనంగ్ జిల్లాలోని నార్ పూ సమీపంలో ఓ బేస్ క్యాంప్ మీద అవలాంచ్ కుప్పకూలడంతో ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, మంచు కారణంగా బేస్‌క్యాంప్ మీద అవలాంచ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. 10 మంది పర్యాటకుల ఆచూకీ గల్లంతైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌లోని మనంగ్ జిల్లా నార్ పూ సమీపంలో 7126 మీటర్ల ఎత్తున గల హిమ్‌లుంగ్ శిఖరం వద్ద గల బేస్ క్యాంప్ మీద అవలాంచ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పర్యాటకులు మరణించగా.. 10 మంది ఆచూకీ గల్లతైంది. ప్రమాదం జరిగే సమయానికి క్యాంప్‌లో 9 మంది పర్యాటకులతో పాటు, 13 మంది సిబ్బంది ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే హెలికాప్టర్ సాయంతో రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని టూరిజం డిపార్ట్‌మెంట్ జనరల్ డైరెక్టర్ రామ్ కృష్ణ లామిచానే వెల్లడించారు. కాగా.. గల్లంతైన వారందరూ నేపాల్ వాసులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
చెస్ ఒలింపియాడ్: భారత్ ఖాతాలో రెండు పతకాలు
ఆసియా క్రీడలు: లాంగ్ జంప్‌లో రజతం.. రన్నింగ్, డెకథ్లాన్‌లో కాంస్యాలు