సామూహిక కాల్పుల్లో 27 మంది దుర్మరణం
ABN , Publish Date - Sep 28 , 2026 | 05:59 AM
దక్షిణాఫ్రికాలోని రెండు అతిపెద్ద నగరాల్లో శనివారం అర్ధరాత్రి కొన్ని గంటల వ్యవధిలో సాయుధులు జరిపిన సామూహిక కాల్పుల్లో 27 మంది దుర్మరణం పాలవ్వగా, 26 మందికి గాయాలయ్యాయని..
దక్షిణాఫ్రికాలోని 2 వేర్వేరు నగరాల్లో ఘటనలు
కేప్‌టౌన్, సెప్టెంబరు 27: దక్షిణాఫ్రికాలోని రెండు అతిపెద్ద నగరాల్లో శనివారం అర్ధరాత్రి కొన్ని గంటల వ్యవధిలో సాయుధులు జరిపిన సామూహిక కాల్పుల్లో 27 మంది దుర్మరణం పాలవ్వగా, 26 మందికి గాయాలయ్యాయని పోలీసులు ఆదివారం తెలిపారు. జోహన్నస్‌బర్గ్ శివారుల్లోని వెలేడా టౌన్‌షి్‌పలోని ఓ బార్ వద్ద ఎనిమిది మంది సాయుధులు ఏకే-రైఫిళ్లు, పిస్టళ్లతో జరిపిన కాల్పుల్లో 17 మంది మృత్యువాత పడగా, 15 మందికి గాయాలయ్యాయి. కాగా, కేప్‌టౌన్ సమీప ల్వాండిల్‌లోని ఓ స్టోర్‌లో శనివారం అర్ధరాత్రి తర్వాత (ఆదివారం తెల్లవారుజామున ఒంటిగంటకు) సాయుధులు జరిపిన కాల్పుల్లో పది మంది మరణించగా, 11 మంది క్షతగాత్రులయ్యారు. అయితే, ఈ కాల్పుల ఘటనలకు సంబంధించి ఎవరిని అరెస్టు చేయలేదన్న పోలీసులు.. అనుమానితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.