మళ్లీ రాజుకుంటున్న పోలవరం వివాదం.. ఫేజ్ 2 పనులపై తెలంగాణ అభ్యంతరం
ABN , Publish Date - May 11 , 2026 | 07:27 PM
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య మరోసారి పోలవరం ప్రాజెక్టు వివాదం ముదురుతోంది. పోలవరం ఫేజ్-2 పనులపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
హైదరాబాద్, మే11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య మరోసారి పోలవరం ప్రాజెక్టు వివాదం ముదురుతోంది. పోలవరం ఫేజ్-2 పనులపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫేజ్-2 పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ముంపు ప్రాంతాలపై పూర్తి స్థాయి సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని స్పష్టం చేసింది. ముఖ్యంగా భద్రాచలం సహా ప్రభావిత ప్రాంతాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
36 వాగుల డ్రైనేజ్ ప్రభావంపై అధ్యయనం చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. పోలవరం లిఫ్ట్ స్కీమ్ పునఃప్రారంభంపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఏపీ పనులు చేస్తోందని ఆరోపించింది. పోలవరం లిఫ్ట్ స్కీమ్ వెంటనే ఆపాలని తెలంగాణ కోరింది. ఏపీ పనులను నియంత్రించాలని పీపీఏకి తెలంగాణ విజ్ఞప్తి చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకారం కావాలి: సీఎం రేవంత్
ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి భేటీ.. తెలంగాణ ప్రాజెక్టులపై చర్చ
మోదీ ఆశీస్సులు, మార్గదర్శనం నాకు ఎప్పటికీ ప్రత్యేకం: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And AP News And International News And Telugu News