Share News

హిందువులంతా మరింత ఐక్యం కావాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్..

ABN , Publish Date - Apr 11 , 2026 | 09:33 PM

హిందువులను సంఘటితం చేసేందుకే స్వయం సేవక్ సంఘ్‌ను కేశవ్ బలీరాం హెడ్గేవార్ స్థాపించారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. హిందువులంతా మరింత ఐక్యం కావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

హిందువులంతా మరింత ఐక్యం కావాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్..
RSS Chief Mohan Bhagwat

నిజామాబాద్: హిందువులను సంఘటితం చేసేందుకే స్వయం సేవక్ సంఘ్‌ను కేశవ్ బలీరాం హెడ్గేవార్ స్థాపించారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. హిందువులంతా మరింత ఐక్యం కావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. కందకుర్తి దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. రెంజల్ మండలం కందకుర్తిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటించారు.


ఈ సందర్భంగా కేశవ్ స్ఫూర్తి మందిరం ప్రారంభోత్సవంలో భగవత్ పాల్గొన్నారు. మందిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. స్ఫూర్తి కేంద్రాన్ని ప్రతి ఒక్క హిందువు సందర్శించాలని భగవత్ విజ్ఞప్తి చేశారు. చరిత్రను భవిష్యత్తు తరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. బ్రిటిష్ పాలకులను భారత్ నుంచి తరిమికొట్టాలని హెగ్డేవార్ తపన పడ్డారని, ఆ కల నెరవేరిందని మోహన్ భగవత్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం..

కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం..

Updated Date - Apr 11 , 2026 | 09:34 PM