మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు: వేణు ఉడుగుల
ABN , Publish Date - Apr 11 , 2026 | 08:27 PM
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా సింగర్ మంగ్లీకి సంబంధించిన వివాదంలో తన పేరు వినిపించడంపై ప్రముఖ సినీ దర్శకుడు వేణు ఉడుగుల స్పందించారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, ఏప్రిల్ 11: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా సింగర్ మంగ్లీకి సంబంధించిన వివాదంలో తన పేరు వినిపించడంపై ప్రముఖ సినీ దర్శకుడు వేణు ఉడుగుల స్పందించారు. ఈ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదని, కేవలం పరిచయస్తుల మధ్య సమస్య పరిష్కారానికి మాత్రమే తాను ప్రయత్నించానని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా వేణు ఉడుగుల మాట్లాడుతూ.. ‘ఇటీవల కొన్ని మీడియా వేదికల్లో నా పేరును ఈ కేసుతో అనుసంధానం చేస్తూ వస్తున్న వార్తలు నన్ను తీవ్రంగా బాధించాయి. ఒక వ్యక్తి పరువు, ప్రతిష్టలు, కుటుంబం ఇలాంటి నిరాధారమైన వార్తల వల్ల ప్రభావితమవుతాయని అందరూ గుర్తించాలి. ఈ కేసుకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్‌లో నా పేరు నిందితుడిగా లేదు. సింగర్ మంగ్లీ ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సుబ్బారావు ఇద్దరూ తనకు పరిచయస్తులే. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, బాధితులకు న్యాయం జరగాలని మాత్రమే సూచించాను. నిజానిజాలు తెలుసుకోకుండా నా పేరును ఈ వ్యవహారంలోకి లాగడం చాలా బాధ వేసింది. నాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణే నాకు బలం, వాస్తవాలను గ్రహించి తప్పుడు ప్రచారాలను నమ్మ వద్దని విజ్ఞప్తి చేస్తున్నా’ అని అన్నారు.
ఈ కేసు పెట్టిన అడ్వకేట్ సుబ్బారావు సైతం మీడియా ముందు మాట్లాడుతూ..‘ఈ విషయంలో వేణు ఉడుగులకు ఎటువంటి సంబంధం లేదు. పంజాగుట్ట పోలీసులు చేపట్టిన విచారణలో కూడా ఈ ఘటనతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
నా అభ్యర్థిత్వానికి ఎసరు పెట్టాలనుకున్నారు.. బీజేపీపై మమత తీవ్రారోపణ
బెంగాల్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే శాంతి భద్రతలు: ప్రధాని నరేంద్ర మోదీ