Share News

బెంగాల్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే శాంతి భద్రతలు: ప్రధాని నరేంద్ర మోదీ

ABN , Publish Date - Apr 11 , 2026 | 02:37 PM

పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ప్రజా మద్దతును చూసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) భయాందోళనలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వివరాల్లోకి వెళితే..

బెంగాల్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే శాంతి భద్రతలు: ప్రధాని నరేంద్ర మోదీ
West Bengal Ppolitics

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ప్రజా మద్దతును చూసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) భయాందోళనలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శనివారం రాష్ట్రంలో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్న మోదీ, ప్రస్తుత అధికార పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీకి లభిస్తున్న ఆదరణను చూసి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం భయాందోళనలకు గురవుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే టీఎంసీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలకు భద్రత కల్పిస్తామని, రాజకీయ హింసలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.


పూర్బ బర్ధమాన్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. ‘పశ్చిమ బెంగాల్ నుంచి చొరబాటుదారులందరినీ తరిమేస్తాం. అలాంటి వారికి మద్దతునిచ్చి, వారు ఇక్కడ స్థిరపడటానికి సహాయపడిన వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. అమాయక ప్రజలపై, రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతాం. అవినీతి, శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తాం. ప్రతి టీఎంసీ గూండా, సిండికేట్, అవినీతిపరుడైన ఎమ్మెల్యే లేదా మంత్రిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. రాజకీయ హింసపై విచారణ జరిపేందుకు, విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు అమలు అవుతున్న పథకాలను బీజేపీ అడ్డుకోదు. మేం అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే పశ్చిమ బెంగాల్‌లో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తాం’ అని అన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీలలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.


ఇవి కూడా చదవండి...

మహిళలు, బాలికలపై దాడులు చేస్తే చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు

ఏబీఎన్‌పై దాడికి యత్నం.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 11 , 2026 | 02:37 PM