మహిళలు, బాలికలపై దాడులు చేస్తే చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:22 PM
కడప జిల్లాలో బాలిక హత్య ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మహిళలు, బాలికలపై దాడులకు తెగబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అమరావతి, ఏప్రిల్ 11: కడప జిల్లాలో జరిగిన దారుణ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలపై దాడులకు తెగబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి విషయాల్లో నిందితులను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించరాదన్నారు. ఖాజీపేట ప్రాంతంలో బాలికపై జరిగిన అమానుష దాడి, హత్య ఘటనపై సీఎం సీరియస్ అయ్యారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఆడబిడ్డల భద్రత విషయం రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
కడప జిల్లా ఖాజీపేటలో రామకీర్తనను(17) వెంకటేశ్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. కొంత కాలంగా ప్రేమించాలంటూ బాలికను వేధింపులకు గురిచేశాడు వెంకటేష్. అందుకు బాలిక నిరాకరించడంతో కోపంతో ఊగిపోయిన ప్రేమోన్మాది.. నిన్న(శుక్రవారం) బాలిక ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆమె ఒంటిరిగా ఉంది. దీంతో తనను ప్రేమించాలని బలవంతం చేశాడు వెంకటేశ్. అందుకు కీర్తన నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో బాలిక గొంతు కోశాడు ఉన్మాది. పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు తిరిగి వచ్చి చూడగా కూతురు రక్తపుమడుగులో పడి ఉంది. దీంతో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బాలిక చనిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇవి కూడా చదవండి...
వైఎస్సార్ చనిపోయినప్పుడు జగన్ ఎక్కడున్నారు: ధూళిపాళ్ల నరేంద్ర
అమరావతిపై పనులపై వైసీపీవి అన్నీ తప్పుడు ప్రచారాలే: మంత్రి నారాయణ
Read Latest AP News And Telugu News