Share News

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేటు బస్సు.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Apr 11 , 2026 | 10:20 AM

కామారెడ్డిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. అంబులెన్స్‌ను ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేటు బస్సు.. ఇద్దరి మృతి
Kamareddy Accident

కామారెడ్డి, ఏప్రిల్ 11: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి వద్ద 44వ జాతీయ రహదారి(NH-44)పై ఈరోజు(శనివారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న అంబులెన్స్‌ను వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న పేషెంట్ సలేహ భాను(63), అంబులెన్స్ డ్రైవర్ షేక్ సర్దార్ (35) ఘటనా స్థలిలోనే మృతి చెందారు. పేషెంట్ భర్త సైఫుల్లా ఖాన్ (76) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.


సలేహ భాను ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ఆదిలాబాద్‌లోని స్వగ్రామానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెనుక నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో అంబులెన్స్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్‌పై నిర్లక్ష్యంగా వాహనం నడపడం, అతి వేగం వంటి ఆరోపణలతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంతో NH-44పై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.


ఇవి కూడా చదవండి...

ఏపీలో చిన్నారులకు డ్రై రేషన్ కార్యక్రమం చేపట్టిన కూటమి ప్రభుత్వం

జ్యోతిరావు పూలేకు సీఎం చంద్రబాబు, లోకేశ్ ఘన నివాళులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 11 , 2026 | 10:34 AM