అమరావతిపై పనులపై వైసీపీవి అన్నీ తప్పుడు ప్రచారాలే: మంత్రి నారాయణ
ABN , Publish Date - Apr 11 , 2026 | 11:19 AM
రాజధాని అమరావతి నిర్మాణ పనులపై వైసీపీ ఆరోపణలపై మంత్రి నారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వాయు వేగంతో అమరావతి పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
అమరావతి, ఏప్రిల్ 11: రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్ట్‌పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారాయణ(Minister Narayana) మండిపడ్డారు. శనివారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మంత్రి మాట్లాడుతూ.. అమరావతిలో పనులు వాయు వేగంతో మూడు షిప్టుల్లో జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అధికారుల భవనాలు మే నెలాఖరుకు హ్యాండోవర్ చేస్తామని తెలిపారు. మే నెలాఖరు నాటికి 90 శాతం ప్రభుత్వ భవనాలు సిద్ధమవుతాయన్నారు. ట్రంక్ రోడ్లు, లేఅవుట్ పనులు 2027 నాటికి పూర్తి అవుతాయని, ఐకానిక్ టవర్లు సహా ప్రధాన నిర్మాణాలు 2028 ఆగస్టు నాటికి సిద్ధం చేస్తామని మంత్రి వెల్లడించారు.
రాజధాని ఖర్చులపై తప్పుడు ప్రచారం..
మూడు సంవత్సరాల్లో అమరావతి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. రాజధాని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ కాదన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. 2014లోనే ల్యాండ్ పూలింగ్ ద్వారా స్పష్టమైన ప్రణాళిక రూపొందించామని చెప్పారు. భవిష్యత్తులో భూముల విలువ పెరుగుదల దృష్ట్యా 5 వేల ఎకరాలు రిజర్వ్ చేసినట్లు తెలిపారు. ఆ భూముల విలువతో తీసుకున్న రుణాలు చెల్లించే విధంగా ప్లాన్ చేశామని వివరించారు. రాజధాని ఖర్చులపై తప్పుదారి పట్టించే ప్రచారం జరుగుతోందని.. స్క్వేర్ ఫీట్ ధరలను వక్రీకరిస్తున్నారని మంత్రి ఆరోపించారు.
ప్రణాళికలకు అనుగుణంగానే పనులు
హైదరాబాద్ సెక్రటేరియట్‌లో స్క్వేర్ ఫీట్‌కు రూ.12 వేలు, ఢిల్లీ సెంట్రల్ విస్టాలో రూ.16 వేలు ఖర్చు అయ్యిందని మంత్రి తెలిపారు. వాటితో పోల్చితే అమరావతి ఖర్చులు సమంజసమేనని స్పష్టం చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను హైకోర్టు ఇప్పటికే కొట్టేసిందని మంత్రి గుర్తు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి అవే విషయాలను మళ్లీ ప్రస్తావించడం అవగాహన లేకపోవడమే అని అన్నారు. అమరావతి ఎప్పటికి పూర్తవుతుందని అడగడం సరికాదన్నారు. ప్రణాళికలకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయని మంత్రి నారాయణ వివరించారు.
మావిగన్ ఓ పిచ్చి ప్రతిపాదన..
గతంలో మూడు రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురి చేశారని మంత్రి విమర్శించారు. ఇప్పుడు అమరావతికి శాశ్వతత్వం కల్పించే బిల్లులకు దేశంలోని అన్ని పార్టీలు (ఒక్క పార్టీ మినహా) మద్దతు పలికాయని తెలిపారు. రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు సాఫీగా సాగుతోందని చెప్పారు. ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ ఈ నెలలో పూర్తవుతుందని.. దీంతో ప్రాజెక్టులకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్, స్టీల్ బ్రిడ్జి పనులు తుదిదశలో ఉన్నాయని తెలిపారు. జాతీయ రహదారులతో కనెక్టివిటీ కోసం భారీ ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. మావిగన్ ఓ పిచ్చి ప్రతిపాదన అని, చిన్నపిల్లలు కూడా దానిపై జోకులు వేసుకుంటున్నారని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
జ్యోతిరావు పూలేకు సీఎం చంద్రబాబు, లోకేశ్ ఘన నివాళులు
వైఎస్సార్ చనిపోయినప్పుడు జగన్ ఎక్కడున్నారు: ధూళిపాళ్ల నరేంద్ర
Read Latest AP News And Telugu News