Share News

ఏబీఎన్‌పై దాడికి యత్నం.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:58 PM

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు దాడికి యత్నించిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ నేతల నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోయిందని విమర్శించారు.

ఏబీఎన్‌పై దాడికి యత్నం.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్
CM Chandrababu

అమరావతి, ఏప్రిల్ 11: హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై(ABN Andhrajyothy) దాడికి యత్నం, ఎండీ వేమూరి రాధాకృష్ణపై(Vemuri Radhakrishna) వైసీపీ నేతలు నోరు పారేసుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) స్పందించారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం మాట్లాడుతూ.. వైసీపీ నేతల నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోయిందని విమర్శించారు. ‘వాళ్లు ఇష్టం వచ్చినట్టు ఏదైనా మాట్లాడుతారు. భవిష్యత్తులో వాళ్లకు అంతా తెలిసి వస్తుంది’ అని సీఎం హెచ్చరించారు.


అమరావతే సరైన సమాధానం...

జగన్ ‘మావిగన్’ విమర్శలకు అమరావతి సరైన సమాధానం ఇస్తుందని చంద్రబాబు అన్నారు. అమరావతి అభివృద్ధే జగన్ బ్యాచ్‌కు పూర్తిస్థాయి కౌంటర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి ఆగదని.. హైదరాబాద్, బెంగళూరు నిరంతరం పెరుగుతున్నట్టే అమరావతి కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ మొత్తం ఆదాయంలో 70 శాతం హైదరాబాద్ నుంచి వస్తుందని తెలిపారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉండటానికి కారణం హైదరాబాద్ అని చెప్పుకొచ్చారు.


అభివృద్ధికి ముగింపు ఉండదు..

రాజధాని అమరావతి ‘సెల్ఫ్ సస్టైనబుల్’ ప్రాజెక్టు కాదని వైసీపీ చేస్తున్న విమర్శలను సీఎం తీవ్రంగా ఖండించారు. రాజధానిలో 5 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని తెలిపారు. ప్రస్తుత రేట్ల ప్రకారం ఎకరం రూ.10 కోట్ల విలువతో ఉన్న భూమి రూ.50 వేల కోట్లు అవుతుందని చెప్పారు. భవిష్యత్తులో ఎకరం రూ.20 కోట్లు అయితే లక్ష కోట్ల విలువ వస్తుందని వివరించారు. ఇటువంటి విషయాలు తెలియని వారు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు. అమరావతి నిరంతరం అభివృద్ధి చెందుతుంటుందని.. అభివృద్ధికి ముగింపు ఉండదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు ఓఆర్‌ఆర్(ORR), ఎయిర్‌పోర్ట్, ఐటీ, నాలెడ్జ్ ఎకానమీ ద్వారా ఆదాయం పెరిగిందన్నారు. సైబరాబాద్ వల్ల హైదరాబాద్ నేటికీ అభివృద్ధి చెందుతూనే ఉందని చెప్పారు. అమరావతి కూడా అదే తరహాలో అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. అభివృద్ధి ఒక్క రోజుతో ఆగదని.. అది నిరంతరం జరిగే ప్రక్రియ అని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.


ఇవి కూడా చదవండి...

అమరావతిపై పనులపై వైసీపీవి అన్నీ తప్పుడు ప్రచారాలే: మంత్రి నారాయణ

మహిళలు, బాలికలపై దాడులు చేస్తే చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 11 , 2026 | 01:49 PM