Share News

కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం..

ABN , Publish Date - Apr 11 , 2026 | 09:05 PM

కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమజంట ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. అద్దెకు ఉంటున్న ఇంట్లో ఇద్దరూ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకే చీరతో ఫ్యాన్‌కు ఇరువైపులా ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు.

కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం..
Proddatur Crime News

కడప: ప్రొద్దుటూరులో ప్రేమజంట ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. అద్దెకు ఉంటున్న ఇంట్లో ఇద్దరూ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకే చీరతో ఫ్యాన్‌కు ఇరువైపులా ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. అద్దెకు ఉన్నవారు ఉదయం నుంచి బయటకు రాకపోవడంతో ఇవాళ(శనివారం) మధ్యాహ్నం ఇంటి యజమాని వారిని పలకరించేందుకు వెళ్లారు.


లోపల నుంచి తలుపు గడియ పెట్టి ఉండడంతో బయట నుంచే పిలిచారు. ఎంత పిలిచినా వారిద్దరూ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల ఇళ్ల వారిని అప్రమత్తం చేశారు. వారంతా వచ్చి తలుపులు పగలకొట్టి చూడగా.. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రేమికులిద్దరూ ఫ్యాన్‌కు వెళాడుతూ కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్య చేసుకున్న తీరును పరిశీలించారు పోలీసులు. అనంతరం మృతులను కర్నూలు జిల్లా దేవరకొండ మండల వాసులు రంగస్వామి, ప్రమీలగా గుర్తించారు.


ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కాని.. ఒకేసారి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే, ప్రమీలకు ముందే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. అతనితో విడిపోయిన సదరు మహిళ.. రంగస్వామితో సహజీవనం చేస్తోంది. నెల రోజుల కిందటే ప్రొద్దుటూరులోని లింగాపురంలో వారిద్దరూ అద్దెకు దిగారు.


ఈ వార్తలు కూడా చదవండి

రెచ్చిపోతున్న దొంగలు.. అందినకాడికి దోచేస్తున్నారు.. జాగ్రత్త..!

ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం..

Updated Date - Apr 11 , 2026 | 09:07 PM