Share News

ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం..

ABN , Publish Date - Apr 11 , 2026 | 05:18 PM

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారుపై సిమెంట్ ప్లయాస్ లారీ బోల్తాపడింది.

ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం..
Keesara Toll Plaza

ఎన్టీఆర్ జిల్లా: కంచికచర్ల మండలం కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బీఎండబ్ల్యూ కారుపై సిమెంట్ ప్లయాస్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు.. టోల్ కట్టేందుకు ప్లాజా వద్ద ఆగింది. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి దానిపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఏపీ, తెలంగాణ హైకోర్టుల సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు మృతిచెందారు.


ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన టోల్ గేట్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మూడు జేసీబీల సహాయంతో అతి కష్టంగా మీద లారీని పైకి లేపారు. ప్రమాద సమయంలో కారులో శ్రీనివాసరావు ఒక్కరే ఉన్నారని, ఆయనే డ్రైవ్ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. శనివారం కావడంతో రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉంది. కాగా, వాహనాలు ప్రస్తుతం ఒకవైపు మాత్రమే నడుస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

విజయవాడలో అమానుషం.. పబ్లిక్ టాయిలెట్‌లో పసిపాపను వదిలి వెళ్లిన మహిళ

మాచర్ల ఏఎస్సై శ్రీనివాసరావు సస్పెషన్.. ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Updated Date - Apr 11 , 2026 | 06:26 PM