Share News

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం

ABN , Publish Date - Apr 11 , 2026 | 07:24 PM

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ మూడో విజయాన్ని నమోదు చేసింది. ముల్లాన్‌పుర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించింది.

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
Punjab Kings

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ మూడో విజయాన్ని నమోదు చేసింది. ముల్లాన్‌పుర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించింది. 4 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించినప్పటికీ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఫలితంగా.. హైదరాబాద్ మూడో ఓటమిని చవి చూసింది.


భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ బ్యాటర్లు అద్భుతం చేశారు. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య(57; 20 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్(51; 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగిన వేళ.. పంజాబ్ గెలుపుకు నాంది పడింది. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 38 బంతుల్లోనే 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత కూపర్ కనోలీ(11), నేహాల్ వధేరా(14) వెనువెంటనే ఔట్ అయినప్పటికీ.. పంజాబ్ కెప్టెన్, మనందరి సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్(69*; 33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగి ఆఖరి వరకు క్రీజులో నిలబడి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. శశాంక్ సింగ్(16*) నాటౌట్‌గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో శివాంగ్ కుమార్ 3 వికెట్లతో రాణించాడు. హర్ష్ దూబె 1 వికెట్ పడగొట్టాడు.


అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(74) హాఫ్ సెంచరీ చేశాడు. ట్రావిస్ హెడ్(38), క్లాసెన్(39) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, శశాంక్ సింగ్ తలో 2, బార్ట్‌లెట్ 1 వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ 220

బాల్ టాంపరింగ్‌ను చట్టబద్ధం చేయాలి.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Apr 11 , 2026 | 08:48 PM